రాత్రి 9 కాగానే అది కావాల్సిందే..టబు బోల్డ్‌ కామెంట్స్‌ ?

Veldandi Saikiran
సీనియర్ నటి టబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. హిందీ, తెలుగులో వరుసగా సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తెలుగులో నాగార్జునతో కలిసి నిన్నే పెళ్ళాడుతా, హలో బ్రదర్ వంటి సినిమాలలో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో టబు నటనకు విపరీతంగా అభిమానులు అయ్యారు. టబూ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే.

మల్లెపల్లి ప్రాంతంలో తన అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఉండేది. తన చదువు పూర్తయిన వెంటనే సినిమాల మీద ఉన్న ఆసక్తితో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నటన, అందం ఉండడంతో టబుకు అదృష్టం కూడా కలిసి వచ్చింది. అతితక్కువ సమయంలోనే హీరోయిన్గా రాణించింది. టబు 50 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ వివాహం చేసుకోలేదు. కాగా టాబు సినిమాలలో నటిస్తున్న సమయంలో ఎంతో మంది హీరోలతో ప్రేమ వ్యవహారాలు నడిపించింది. ఏ ఫైర్లు చాలామందితో పెట్టుకుంది.

ఒకరితో ప్రేమలో ఉండడం వారికి బ్రేకప్ చెప్పడం మళ్ళీ ఇంకొక హీరోతో ప్రేమాయణం నడిపించడం ఇలా చాలానే చేసింది. తెలుగు హీరోలతో, హిందీ హీరోలతో టబూ విపరీతంగా ఎఫైర్లు, ప్రేమలు కొనసాగించింది. ఏమైందో తెలియదు అందులో ఎవరిని కూడా వివాహం చేసుకోలేదు. కాగా టబు కొద్ది రోజుల నుంచి తెలుగులో పెద్దగా నటించడం లేదు. అలా వైకుంఠపురం సినిమాతో టబూ తన సెకండ్ ఇన్నింగ్స్ నీ ప్రారంభించింది. అలా వైకుంటపురం సినిమాలో కీలకపాత్రను పోషించింది. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలలో నటించి బిజీగా మారిపోయింది. ప్రస్తుతం టబు బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలలో నటిస్తోంది.

చేతినిండా  సినిమాలతో బిజీగా ఉంది. కాగా వయసు పెరిగినప్పటికీ టబు అంతే అందం, ఫిట్నెస్ తో చెక్కుచెదరకుండా ఉంది. దానికి గల ప్రధాన కారణం ఆమె ఫుడ్ విషయంలో చాలా మంచి డైట్ ఫాలో అవుతుందట. తనకు నచ్చిన ఆహారాన్ని తీసుకోకుండా ఆరోగ్యానికి మంచి చేసే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుందట. కానీ రాత్రి సమయంలో మాత్రం తన డైట్ పక్కన పెట్టేసి తొమ్మిది గంటలు దాటిన అనంతరం ఐస్ క్రీమ్ లేదా స్వీట్స్ మాత్రమే తిని పడుకుంటుందట. ఆమెకు ఐస్ క్రీమ్ స్వీట్స్ అంటే చాలా ఇష్టమట. ప్రతిరోజు రాత్రి వాటిని మాత్రమే తింటుందట. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా స్వీట్, ఐస్ క్రీం తింటూ ఎంజాయ్ చేస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: