సంక్రాంతికి రిలీజయ్యే అన్ని ల టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులిచ్చింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్ తో పాటు వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం టికెట్ల ధరల పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.అయితే తెలంగాణలో ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఈ విషయంపై టీఎఫ్‌డీసీ ఛైర్మన్, దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో లాగే తెలంగాణలోనూ టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానన్నారు. ‘గేమ్ ఛేంజర్ పీ రిలీజ్ ఈవెంట్ అద్భుతమైన ఈవెంట్. మాకోసం టైం స్పెండ్ చేసి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఏపీ లో టికెట్ రేట్స్ పెంచినందుకు ఏపీ సీఎం డిప్యూటీ సీఎం, టోగ్రఫీ మినిస్టర్ కు ధన్యవాదాలు. గేమ్ చేంజెర్ ప్రత్యేకమైన . మూడున్నర సంవత్సరాల గేమ్ ఛేంజర్ జర్నీ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసాను. ఫీల్డ్ లో సక్సెస్ ఉంటేనే ఏదైనా చేయగలం. హీరో ఒక్కడి తప్పితే ఈ మూవీలో ఏముంది శంకర్ ఏమీ చేస్తాడులే అని అన్నారు. ఇవన్నీ కూడా నన్ను నేను మళ్లీ మార్చుకుని చేసిన గేమ్ ఛేంజర్. ఇది నాకు కం బ్యాక్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు చూసి మెచ్చుకున్నారు. ప్రేక్షకులు కూడా వావ్ అనే రీతిలో గేమ్ ఛేంజర్ ఉంటుంది .ఇందులో పాటల కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టాం. గేమ్ ఛేంజర్ తో పాటు సంక్రాంతి కి వస్తున్నాం కూడా బాగా వచ్చింది. ఎఫ్2, ఎఫ్ 3 ఎలా ఎంజాయ్ చేసారో ఇది కూడా అలాగే ఉంటుంది.
అలాగే ఇటీవల నా జడ్జెమెంట్ తప్పిందని కామెంట్స్ వినిపించాయి. ఫామిలీ స్టార్ ప్లాప్ తర్వాత నా ఏడేళ్ల మనవడు తాత నువ్వు టెన్షన్ పడకు నీ చేతిలో గేమ్ ఛేంజర్ ఉంది అని అన్నాడు. ఆ క్షణం నన్ను నేను జడ్జ్ చేసుకుని ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాను. దిల్ రాజు జడ్జ్ మెంట్ పోయిందా అని మాటలు వినిపించాయి. ఇండస్ట్రీలో సక్సెస్ లేకుంటే ఎవరు కనీసం వాల్యూ ఇవ్వరు. మరోవైపు శంకర్ సినిమా ఇండియన్ -2 ప్లాప్ కావడంతో ఆయన చేసే గేమ్ ఛేంజర్ ఏముంటది అని అనేక మాటలు విన్నాను. దీంతో శంకర్ నాలుగేళ్ళ క్రితం నాకు ఏ కథ అయితే చెప్పాడో అది వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ, ఈ సినిమా రిజల్ట్ మీకు, నాకు చాలా ముఖ్యం అని శంకర్ కు గుర్తు చేస్తూ పక్కాగా రెడీ చేసాం. ఇప్పుడు చెప్తున్నాను ఈ గేమ్ ఛేంజర్ నాకు, శంకర్ కు కంబ్యాక్ ఫిల్మ్ ఈ మాట నేను కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను’ అని అన్నారు.ఇదిలావుండగా నా సినిమా లు చూసి సంక్రాంతికి దిల్ రాజు కం బ్యాక్ అని జనాలు అంటారు . తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను. ఆయన సానుకూలంగా స్పందిస్తారేమో చూడాలి. ఇండస్ట్రీ అభివృద్ధికి ఆయన కూడా ముందు చూపుతో ఉన్నారు. కాబట్టి నిర్మాత గా టికెట్ రేట్ల పెంపు కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.