కోహ్లీ తనపై తానే కోపం చూపించుకున్నాడు.. ఆసీస్ మాజీ షాకింగ్ కామెంట్స్?
ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం ఇదే తరహాలు వ్యాఖ్యలు చేయడం పెద్ద చర్చకు దారితీసిన సంగతి విదితమే. దీనిపై భారత అభిమానులు పాంటింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు కూడా. దాంతో విరాట్ కోహ్లీని అతడు కవ్వించే ప్రయత్నం చేశాడు. కోహ్లీయే అత్యుత్తమ ఆటగాడని, తనకి నచ్చిన బ్యాటర్ అని కొనియాడడం విదితమే. ఇక అసలు విషయంలోకి వెళితే... మరేం పర్వాలేదు! కోహ్లీ వద్ద ఇంకా చాలా పరుగులు ఉన్నాయన్న అతని కామెంట్స్ ఇపుడు మీడియాలో మరో చర్చకు దారితీస్తోంది.
విషయం ఏమిటంటే? సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో విరాట్ అవుట్ అవ్వగానే తీవ్రమైన అసహనానికి గురైన సంగతి తెలిసిందే. ఇక దానిపై ఆసీస్ మాజీ ఆటగాడు పాంటింగ్ కామెంట్స్ చేస్తూ... "వరుసగా అవుట్ అవుతూ... పెవిలియన్ చేరడం ఎవరికన్నా బాధగానే ఉంటుంది! అందుకే ఈ రన్ మెషీన్ అవుట్ అయిపోయినందుకు తనపై తానే కోపం పెంచుకుంటున్నాడు.. కానీ లాభం ఏమిటి? కానీ ఏదోరోజు కోహ్లీ తన ప్రతాపాన్ని చూపుతాడు.. ఎందుకంటే? ఆయన దగ్గర ఇంకా పరుగులు మిగిలి వున్నాయనే అర్ధం అవుతోంది!" రాసుకొచ్చాడు. కాగా ఈ వ్యాఖ్యలు మరలా వైరల్ అవుతున్నాయి.