ఇక వాట్సాప్ డేటా హ్యాకింగ్‌ను అడ్డుకోండి ఇలా..!
అయితే ఈ క్రమంలో వాట్సాప్ సెట్టింగ్స్‌లో చిన్నచిన్న మార్పులు చేస్తే ఇక మీ చాటింగ్ మొత్తం సురక్షితంగా ఉంచుకోవచ్చునని నిపుణులు తెలిపారు. ఇక వాట్సాప్‌లోని చాటింగ్ డేటా డిఫాల్ట్‌గా ప్రతిరోజూ గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతుంటుందని తెలిపారు. గూగుల్ డ్రైవ్‌లోని సమాచారానికి కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉందని చెబుతున్నా ఇక్కడి నుంచే ఎక్కువగా యూజర్ల డేటా లీక్ అవుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాట్ డేటా బ్యాకప్ చేసే సమయంలో జాగ్రత్త వహించాలని తెలిపారు. దీని కోసం ఏం చేయాలో ఒక్కసారి చూద్దామా.
అయితే ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ 'ఆప్షన్' క్లిక్ చేయాలని తెలిపారు. ఇప్పుడు మరో మెనూ ఓపెన్ అవుతుందన్నారు. ఇక అందులో డార్క్ కలర్‌లో కనిపించే 'బ్యాకప్'పై క్లిక్ చేయాలని అన్నారు. మొత్తం ఐదు ఆప్షన్లు ఓపెన్ అవుతాయని తెలిపారు. అందులో 'never' లేదా 'only when i tap backup' ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవాలని తెలిపారు. ఇక ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే ఇకపై ఆటోమేటిక్‌గా బ్యాకప్ ప్రాసెస్ జరగదు. చాటింగ్ డేటా కూడా గూగుల్ డ్రైవ్‌లోకి అప్‌లోడ్ అవదని తెలిపారు. ఒకవేళ ఎప్పుడైనా చాటింగ్ డేటా బ్యాకప్ తీసుకోవాలనుకున్నా వైఫై ద్వారా కాకుండా మొబైల్ డేటా ద్వారానైతే హ్యాకర్ల బారిన పడకుండా నిరోధించవచ్చునని నిపుణులు తెలిపారు.