బుల్లిపిట్ట: ఆండ్రాయిడ్ 11తో వచ్చే మొట్ట మొదటి ఫోన్ ఇదే...!

Suma Kallamadi
ఆండ్రాయిడ్ 11 తో రానున్న మొదటి ఫోన్‌ ఇదే. మరి ఆ ఫోన్ గురించి వివరాలు ఇప్పుడే చూసేయండి. వివో  వీ20 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ అక్టోబర్ 12 వ తేదీన విడుదల కానుంది.  మన దేశంలో ఆండ్రాయిడ్ 11 తో లాంచ్ కానున్న మొట్ట మొదటి ఫోన్ ఇదే. వివో వీ20 స్టాక్ ఆండ్రాయిడ్‌తో కాకుండా ఆండ్రాయిడ్ 11 ఆధారిత మీద పని చేస్తుంది. ఈ ఫోన్ ఫీచర్స్ లోకి వెళితే.....వివో వీ 20 లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించనున్నారు. 2.2 గిగాహెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ ‌పై ఈ ఫోన్ పని చేయనుంది.

అలానే  కలర్స్ విషయానికి వస్తే.....  సన్ సెట్ మెలోడీ, మిడ్ నైట్ జాజ్, మూన్ లైట్ సొనాటా రంగుల్లో అందుబాటులో ఉండనుంది. కెమెరా లోకి వెళితే..... వెనక వైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, దీంతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉండనున్నాయి.

 ఇక ముందువైపు సెల్ఫీల కోసం 44 మెగా పిక్సెల్ కెమెరాను అందించనున్నారు. అలానే దీని బ్యాటరీ సామర్థ్యం వచ్చేసి... 4000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 33W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ స్టోరేజ్‌ లోకి వెళితే...  8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు. ఈ ఫోన్ కేవలం 0.74 సెంటీ మీటర్ల మందం, 171 గ్రాముల బరువు మాత్రమే ఉన్నాయి.  మరి కొనుగోలు చెయ్యాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: