స్మార్ట్ యాప్‌లతో తక్కువ ధరకే ఎల్‌ఈడీ టీవీలు..!
ఇక థాయిలాండ్‌కు చెందిన ఎల్‌ఈడీ టీవీ, అప్లియేన్సెస్ తయారీ సంస్థ ట్రీవ్యూ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్‌డీ టీవీ మోడళ్లతో భారత్‌లోకి ప్రవేశిస్తోంది. భారతదేశం, మిడిల్ ఈస్ట్, యూరోపియన్, యు.ఎస్, ఆఫ్రికన్ దేశాలలో తమ ఉత్పత్తులను పరిచయం చేయడానికి క్యూట్రీ వెంచర్స్ తో కంపెనీ భాగస్వామ్యం చేసుకుందని వెల్లడించారు. ఇక ట్రీవ్యూ టీవీ యూనిట్లు భారతదేశం అంతటా ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ భారతదేశంలో ట్రీవ్యూకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్య్వవహరించనున్నారు. 32 అంగుళాల నుండి 65 అంగుళాల టీవీలను స్మార్ట్ యాప్‌లతో కంపెనీ పరిచయం చేయనుందని సీఈఓ తెలిపారు.
అంతేకాదు థాయ్‌లాండ్ సంస్థ ట్రీవ్యూ 32 అంగుళాల స్మార్ట్ టీవీలను రూ .11,990కు, 4కె 65 అంగుళాల స్మార్ట్ టీవీల ధర రూ.45,990గా నిర్ణయించిందని తెలిపారు. అంతేకాక నాన్-స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ 24 అంగుళాలకు ధర రూ .6,990, 32 అంగుళాలకు రూ .8,990 అందించనున్నారు. ఇక ఇండియాలో మొదటిసారి 100 అంగుళాల నుండి 300 అంగుళాల లేజర్ టీవీలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే హోటళ్ళు, రెస్టారెంట్లు వంటి వ్యాపారాల కోసం మేము బడ్జెట్ టీవీలను కూడా తయారు చేస్తాము అని పీటర్ ఈ సందర్బంగా వెల్లడించారు.