64MP కెమెరాతో రాబోతున్న పోకో ఎక్స్3 స్మార్ట్ ఫోన్

Suma Kallamadi
షివోమి నుండి విడిపోయిన తర్వాత పోకో స్మార్ట్ ఫోన్ కంపెనీ మొబైల్ ప్రియులను ఆకర్షించడానికి తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. రెండేళ్ల క్రితం పోకో కంపెనీ పోకో ఎఫ్1 పేరిట ఓ మొబైల్ ఫోన్లను విడుదల చేస్తే... అవి ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఐతే పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్ చాలా సమర్థవంతంగా పని చేయడంతో ఆ కంపెనీ నుండి ఇంకా ఎక్కువ స్మార్ట్ ఫోన్లను వినియోగదారులు ఆశించారు. ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం పోకో కంపెనీ ఎక్స్2 పేరిట ఒక మొబైల్ ఫోన్ ను విడుదల చేసింది. అయితే ఆల్రెడీ చైనా లో విడుదలైన రెడ్మీ మొబైల్ ఫోన్ కే పేరు మార్చి poco x2 విడుదల చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే పోకో ఎక్స్2 ఫోన్ ని మన భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేయలేదు.

ఐతే పోకో త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. పోకో సంస్థ ఇంకా అధికారిక లాంచ్ డేట్ ని వెల్లడించలేదు కాని టీజర్లను తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఆ టీజర్లను మీరు క్రింద వీడియోలో చూడవచ్చు. ఐతే త్వరలోనే లాంచ్ కానున్న పోకో ఎక్స్3 64 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుందని... పోకో యొక్క ప్రొడక్ట్ మేనేజర్, గ్లోబల్ ప్రతినిధి అంగస్ కై హో వెల్లడించారు. అంగస్ కై హో పోకో ఎక్స్ 3 యొక్క కొన్ని కెమెరాల ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఆ ఫోటోలలో పోకో ఎక్స్3 64 మెగాపిక్సెల్ కెమెరా ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

పోకో ఎక్స్3 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో,  5,160 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో లభించనున్నదని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ తో వినియోగదారులకు సూపర్ స్మూత్ అనుభవాన్ని కలిగిస్తుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ లో మేజర్ హైలైట్ 64 మెగాపిక్సెల్ AI సూపర్ కెమెరా అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: