టెక్నాలజీ: షేర్‌ఇట్ లేదని బాధపడుతున్నారా.. అయితే మీకోసమే ఈ ‘డోడో డ్రాప్’!!
ఫోన్ మరియు కంప్యూటర్ మధ్య ఫైల్‌లను భాగస్వామ్యం చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. దీనిని కూడా దేశంలో మిలియన్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల ఈ యాప్ బ్యాన్ అవ్వడంతో.. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే అలాంటి వారికోసం ఇప్పుడు `డోడో డ్రాప్` అందుబాటులోకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా చాట్‌ఇయర్‌కు చెందిన అష్ఫక్ మహమూద్ చౌదరి అనే 17 ఏండ్ల బాలుడు ఈ ఫైల్ షేరింగ్ యాప్‌ను అభివృద్ధి చేశాడు.
ఈ డోడో డ్రాప్ యాప్ ద్వారా ఇంటర్‌నెట్ లేకుండా ఆడియోలు, వీడియోలు, చిత్రాలు, పాఠాలను షేర్ చేసుకోవచ్చు. ఈ డోడో డ్రాప్ అనువర్తనం 480 ఎంబీపీఎస్ వరకు బదిలీ రేటును కలిగి ఉందని, ఇది షేర్ ఇట్ కంటే వేగంగా ఉంటుందని, దీన్ని యూజ్ చేయడం చాలా సులభమని అష్ఫక్ మహమూద్ చౌదరి పేర్కొన్నాడు. ఇక ఈ యాప్‌ను డెవలప్ చేసేందుకు తనకు 4 వారాల సమయం పట్టిందన్నాడు. ఆగస్టు 1న దీన్ని విడుదల చేశానని తెలిపాడు. కాగా, ప్రధాని మోదీ ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా తాను ఈ యాప్‌ను డెవలప్ చేశానని, ఇకపై కూడా ఇలాగే భారత యూజర్లకు అవసరమయ్యే యాప్స్ తయారు చేస్తానని చెప్పుకొచ్చాడు అష్ఫక్ మహమూద్ చౌదరి చెప్పుకొచ్చాడు.