బుల్లిపిట్ట: ఫేసుబుక్ మెసెంజర్ ని ఎలా లాక్ చేయాలో తెలుసుకోండి..!

Suma Kallamadi

ఫేసుబుక్ మెసెంజర్ అప్లికేషన్ కి తాజాగా ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అయితే ఈ అప్ డేట్ లో ఫేసుబుక్ మెసెంజర్ యాప్ ని బయోమెట్రిక్ అతేంటికేషన్ వినియోగించి లాక్ చేసుకునే ఫీచర్ ఇవ్వబడింది. అయితే ఈ ఫీచర్ కేవలం ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా విడుదలైన మెసెంజర్ వెర్షన్ 274.1 తో ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులు ఫేస్ ఐడి లేకపోతే టచ్ ఐడిని కూడా ఉపయోగించి అప్లికేషన్ ని లాక్ చేయవచ్చు. మీ ప్రైవేట్ సంభాషణలను స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కనిపించకుండా జాగ్రత్త పడేందుకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 


ఇక ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేసుకోవడానికి ఫేసుబుక్ మెసెంజర్ లో ఫేస్ ఐడి లాక్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆన్ ఆప్షన్ ని ఎంపిక చేసుకోండి. ఒకవేళ మీరు మీ వేలిముద్రలతో లాక్ చేయాలనుకుంటే మెసెంజర్ సెట్టింగ్ లోకి వెళ్లి ఫింగర్ ప్రింట్ లాక్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆన్ చేయండి.  మీరు ఈ ఆప్షన్ పై క్లిక్ చేయగానే, ఫేస్‌బుక్ మెసెంజర్‌ నుండి బయటికి రాగానే వెంటనే లాక్ చేయాలా లేదా 1 నిమిషం తర్వాత లాక్ చేయాలా, 15 నిమిషాలు లేదా ఒక గంట తర్వాత లాక్ చేయాలనుకుంటున్నారా?  అనే నాలుగు ఆప్షన్లు మీకు చూపించబడతాయి. అప్పుడు మీరు ఆ నాలుగు ఆప్షన్లలో మీకు ఇష్టమైన సమయాన్ని ఎంచుకోండి. దీంతో ఫేస్ ఐ డి,  టచ్ ఐడి లాక్ ప్రక్రియలు పూర్తవుతాయి. అయితే ఈ మెసెంజర్ అప్లికేషన్ కి లాక్ ఆన్ చేసినప్పటికీ, మీరు అన్‌లాక్ చేయకుండానే మెసేజ్ నోటిఫికేషన్‌లు, కాల్‌లను చూడవచ్చు.


రాబోయే కొన్ని నెలలలో యాప్ లాక్ ఫీచర్ ఆండ్రాయిడ్‌కు కూడా వస్తుందని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు చెప్పారు. దీంతో బయోమెట్రిక్ ప్రామాణీకరణ పద్ధతి ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ చాట్‌లను లాక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: