ఎయిర్‌టెల్ కస్టమర్లకు పిడుగులాంటి వార్త... పెరిగిన ఎయిర్‌టెల్‌ చార్జీలు..!

ఎయిర్‌టెల్ వినియోగదారులకు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ భారీ షాక్ ఇచ్చింది. కనీస రీఛార్జి మొత్తాన్ని గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు చేసింది. గతంలో ఎయిర్‌టెల్ కస్టమర్లకు కనీస రీఛార్జి 23 రూపాయలు కాగా ఇప్పుడు ఆ మొత్తాన్ని ఎయిర్‌టెల్ సంస్థ 45రూపాయలకు పెంచింది. పెంచిన కనీస రీఛార్జి మొత్తం నిన్నటి నుండి అమలులోకి వచ్చింది. ఎయిర్‌టెల్ కస్టమర్లు ఎయిర్‌టెల్ సేవలు అవాంతరాలు లేకుండా పొందాలంటే 45 రూపాయలు రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఎయిర్‌టెల్ వినియోగదారులు ఇకనుండి 28 రోజులకు 45 రూపాయల రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కనీస రీఛార్జి వలన ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఎటువంటి ఉచిత కాల్స్ లేదా ఎటువంటి డేటా కూడా లభించదు. ఎయిర్ టెల్ కంపెనీ 45 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం రీఛార్జి చేసుకోవాలని అలా చేసుకోకపోతే ప్లాస్ గ్రేస్ పీరియడ్ ముగిసే వరకే సేవలు అందుతాయని ఆ తరువాత సేవలు నిలిపివేస్తామని కంపెనీ పేర్కొంది. 
 
కొన్ని రోజుల క్రితం ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జి పథకాల మొత్తాల్ని దాదాపు 50 శాతం పెంచింది. తాజాగా ఎయిర్‌టెల్ మరోసారి వినియోగదారులపై భారీగా భారం పడేలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎయిర్‌టెల్‌ దాదాపు 95 శాతం ధరలు పెంచింది. ఎయిర్‌టెల్‌ కనీస రీఛార్జి లను పెంచటంతో వొడాఫోన్, ఐడియా కూడా ఎయిర్‌టెల్‌ బాటలోనే నడిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నూతన సంవత్సరంలోకి ప్రవేశించే వేళలో ఎయిర్‌టెల్‌ పిడుగులాంటి వార్త చెప్పిందని వినియోగదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: