టీవీ: ఎఫైర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ దివి..!
అమ్మాయిలు కూడా అన్ని విషయాలు తెలిసిన తెలియనట్లుగా నటిస్తూ ఉంటారు.. ఇలా ఉండడం చాలా తప్పు మీ జీవితంలో ఎంత రియాలిటీగా ఉంటారో అంత బాగుంటుందంటూ కూడా తెలియజేసింది.. ఒకవేళ మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ రియాల్టీ చూసి అబ్బాయిలు చాలా సఫర్ అవుతారు.. అబ్బాయిలు కూడా ఈ విషయంలో అమ్మాయి వైపుగా ఆలోచించాలని తెలియజేసింది దివి.. మనం మనలాగా ఉండే వారి కోసమే రిలేషన్షిప్ నీ వెతకాలి ఎవరికోసమో మారాల్సిన పనిలేదని కూడా తెలియజేసింది.
అమ్మాయిలకు బెస్టీలు అబ్బాయిలైతేనే అవుతారు.. బాయ్ ఫ్రెండ్ చాలా జెన్యూన్ గా ఉండాలి.. స్నేహం వేరు ప్రేమ వేరు ఈ రెండిటిని ఒకేలా ఎప్పటికీ చూడకూడదని ఈ రెండు చాలా డిఫరెంట్ రిలేషన్స్ అంటూ తెలియజేసింది.. ఇలాంటివి తెలుసుకొని చాలామంది ప్రవర్తిస్తేనే మంచిదని కూడా తెలియజేసింది దివి.. దివి కెరియర్ విషయానికి వస్తే హీరోయిన్ కావాలని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్గా నటించిన అవి పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి కానీ బిగ్ బాస్ సీజన్ -4 లో అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత మహర్షి, గాడ్ ఫాదర్, రుద్రాంగి ,జిల్లా తదితర చిత్రాలలో నటించింది. వీటితోపాటు పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటించింది దీవి. అయితే దివి ఇలా ఎఫైర్స్ గురించి మాట్లాడడంతో ఒకసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు.