టీవీ: 17 ఏళ్ల వయసులోనే ఆ పని మొదలు పెట్టా.. విష్ణు ప్రియ..!!

Divya
బుల్లితెరపై యాంకర్ గా విష్ణు ప్రియ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.. పోవే పోరా వంటి ప్రోగ్రామ్తో యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ మొదట మోడలింగ్ రంగం నుంచి అడుగుపెట్టి ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది.ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నది.ఇక విష్ణు ప్రియ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటుంది. ఇక అప్పుడప్పుడు తన హాట్ ఫోటోషూట్లను వీడియోలను షేర్ చేస్తూ పూర్వకారులకు మతిపోయేలా ఉంటుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది యూత్లో.

ఇక గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా విష్ణు ప్రియ మొదటిసారి ఎప్పుడు మీరు కిస్ పెట్టుకున్నారు అనే ప్రశ్న ఎదురవ్వగా.. అందుకు విష్ణు ప్రియ మాట్లాడుతూ తనకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కెమెరా ముందు ముద్దు పెట్టుకున్నానని తెలియజేసింది. ఇక ఫోక్ డాన్స్ చేయడం అంటే తనకి చాలా ఇష్టమని తెలియజేసింది. ఇక మిమ్మల్ని ఎవరైనా పొగిడారా అనే ప్రశ్న విష్ణు ప్రియకు ఏదరవ్వగా.. అందుకు విష్ణు ప్రియ ఒకసారి సుకుమార్ గారి ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఒక యార్డులో నేను నటించినప్పుడు సుకుమార్ గారి మీరు బాగానే చేశారు అని తెలియజేశారట.

అంతేకాకుండా తను యాంకరింగ్ గా చేసే కొన్ని ప్రోగ్రామ్స్ ను కూడా నేను చూస్తూ ఉంటానని చెప్పారట సుకుమార్. దీంతో తనకు చాలా సంతోషంగా అనిపించింది అని తెలిపింది విష్ణు ప్రియ. ఇక ఏ హీరోతో మీరు కలిసి నటించాలనుకున్నారు డాన్స్ చేయాలనుకుంటున్నారు అని అడగగా.. అందుకు విష్ణు ప్రియ అఖిలతో కనీసం ఒక్క పాటలోనైనా డాన్స్ చేయాలని.. ఈ అవకాశం ఎలా వచ్చినా సరే కచ్చితంగా నటిస్తానని ఇంటర్వ్యూలో తెలియజేసింది విష్ణు ప్రియ. గతంలో విష్ణు ప్రియ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: