టీవీ: రాహుల్ తో రిలేషన్ షిప్ పై ఓపెన్ అయిన ఆషు రెడ్డి..!!
బిగ్ బాస్ సీజన్ త్రీ లో రాహుల్ సిప్లిగంజ్ తో ఈమె చాలా వరకు దూరంగా ఉండేది కానీ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత.. రాహుల్ తో పలుచోట్ల తిరుగుతూ కనిపించింది. అప్పుడప్పుడు తన ఇంస్టాగ్రామ్ లో కూడా ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఉండేది. దీంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అన్నట్లుగా పలు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా అషు రెడ్డి ఇంస్టాగ్రామ్ లో అస్క్ మీ అనే సెక్షన్ ను ఏర్పాటు చేసింది..
ఈ క్రమంలోనే రాహుల్ , అజయ్ ని పోలుస్తూ ఒక ప్రశ్న ఎదురైంది.. దానికి గాను ఈ ముద్దుగుమ్మ ఇద్దరితో కలిసి దిగిన ఫోటోలు పెట్టేసి.. ఒకరు తన ఫ్రెండ్ అని మరొకరు నా ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలియజేసింది. ఈ విషయం తెలిసిన రాహుల్ అభిమానులు.. తనే అషు రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్ అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇన్ని రోజులకు అషు రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విషయం బా గా వైరల్ గా మారుతోంది.