వైరల్: ఇండియాలోకి చైనా వైరస్ ఎంటి.. ఆరోగ్యశాఖ కీలక ప్రకటన..!

Divya
గత కొంతకాలం నుంచి వైరస్ పేరు వినగానే ప్రజల సైతం ఎక్కువగా భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనా వైరస్ వల్ల చాలామంది అతలాకుతలమయ్యారు. అప్పటి నుంచి ఏదో ఒక వేరియంట్ లో ఏదో ఒక వైరస్ అయితే వినిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు తాజాగా చైనా నుంచి ఒక కొత్త వైరస్ వణుకు పుట్టించేలా ప్రజలను చేస్తోంది. అదే హ్యూమన్మోటాన్యూమో వైరస్.. దీనిని HMPV అని పిలుస్తూ ఉంటారు. ఈ వైరస్ వల్ల ఇప్పుడు చాలామంది చైనాలోని ప్రజలు ఆసుపత్రి పాలయ్యి చికిత్స పొందుతూ ఉన్నారట.

ముఖ్యంగా అక్కడ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ కూడా ఈ వైరస్ అటాచ్ చేస్తూ ఉండడంతో ఇది అంటూ వ్యాధిగా వ్యాపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వైరస్ ప్రధాన లక్ష్యం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పెట్టడం లేకపోతే ఊపిరితిత్తుల పైన ప్రభావం చూపించేలా చేస్తుందట. దీనిని కట్టడి చేసేందుకు సైతం చైనా ప్రభుత్వం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వైరస్ గురించి భారత్ లో కూడా ప్రచారం జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతూ ఉండడంతో DGHS ఉన్నత అధికారి డాక్టర్ అతుల్ గోయల్ పలు విషయాలను తెలిపారు.

డాక్టర్ అతుల్ గోయల్ మాట్లాడుతూ ఈ వైరస్ గురించి భారత్ ప్రజలు ఎలాంటి భయపడాల్సిన పనిలేదని శ్వాసకోత సంబంధిత ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకునేందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.హ్యూమన్మోటాన్యూమో వైరస్ గురించి వినిపిస్తున్న వార్తలు ఇది సాధారణ జలుబు లాగా ఉంటుందని శ్వాస కోస వైర్లెస్ గా ఉంటుందని చిన్న పెద్ద వారిలో కూడా ఇది వస్తుందని డాక్టర్ గోయల్ వెల్లడించారు. చలికాలంలో ఎవరికైనా దగ్గు జలుబు ఉంటే వారు మిగతా వారిని కలవకపోవడమే మంచిదని ఆ తర్వాత వైరస్ వ్యాప్తి చెందదని కూడా వెల్లడించారు. దగ్గు తుమ్ము వచ్చే సమయంలో ప్రత్యేకంగా మాస్క్ పెట్టుకోవాలని ఆ మాస్కుని కాల్చి వేయాలంటూ సూచించారు. అలాగే ఎవరికైనా జ్వరం జలుబు ఉంటే మందులు ఉపయోగించాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: