అతన్ని రెచ్చగొడితే.. టీమిండియా ఏకమవుతుంది: ఆసీస్ మాజీ
భారత పేసుగుర్రానికి అందరూ ఇంత భయపడుతుంటే ఓ తింగరి బ్యాటర్ మాత్రం బుమ్రా అయితే నాకేంటి? అన్నట్టు వ్యవహరించాడు. నువ్వు నన్నేమీ పీకలేవు అంటూ వాదులాటకు దిగాడు. కట్ చేస్తే ఏం జరిగిందో తెలుసా? వివరాల్లోకి వెళితే... స్లిప్‌లో కేఎల్ రాహుల్ పట్టిన అదిరిపోయే క్యాచ్ భారత ఆటగాళ్ల సంబరాలకు కారణమైంది. ఇది చివరి బంతికి వికెట్ పడటం మాత్రమే కాదు సుమా... నాన్ స్ట్రైకర్ గా ఉన్న కొన్‌స్టాస్‌తో బుమ్రా మధ్య జరిగిన వాగ్వాదం కూడా ఆటను మరింత రక్తి కట్టించిందని చెప్పుకోవచ్చు. ఔను, భారత్ బ్యాటింగ్ సమయంలోనే కొన్‌స్టాస్ కోరి కయ్యానికి కాలు దువ్వేవాడు. బుమ్రా బౌలింగ్ మొదటి బంతినే బౌండరీకి పంపి, మ్యాచ్ రసవత్తరంగా మారుతుందని ఆశించాడు. ఆ తరువాత బుమ్రా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఖవాజా స్ట్రైకింగ్‌కి ముందుకు రావడంతో చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో పొగరుగా నాన్ స్ట్రైక్ లో ఉన్న కొన్‌స్టాస్ మాటలకు బుమ్రా తగిన సమాధానం ఇచ్చినప్పటికీ, అంపైర్ మద్యవర్తిత్వంతో గొడవ కాస్త సద్దుమణిగింది. ఆ వెంటనే బుమ్రా కొన్‌స్టాస్ పైన ఉన్న కోపాన్ని మొత్తం స్ట్రైకింగ్ లో ఉన్న ఖవాజాపై చూపించి అటకట్టించాడు. అతను వేసిన బంతికి ఖవాజా స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో, బుమ్రా సత్తా మరోసారి రుజువు అయ్యింది. దాంతో బుమ్రా వెంటనే కొన్‌స్టాస్ కు కౌంటర్ ఇచ్చేలా పెద్దగా అరిచాడు. ఇక వీరి మధ్య వివాదం మ్యాచ్ కే హైలెట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి సిడ్నీ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్టులో మొదటి రోజు ఆట ఉత్కంఠగా ముగిసింది.