బన్నీకి 2025 సంవత్సరం కలిసొచ్చినట్టే.. ఆ ఒక్క విషయంలో మాత్రం మారితే చాలు!
పుష్ప ది రూల్ మూవీ ఏకంగా 800 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచింది. వాస్తవానికి ఈ స్థాయిలో ఒక భారీ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదు. అయినప్పటికీ పుష్ప ది రూల్ మూవీ మాత్రం అలవోకగా ఈ రికార్డును సాధించిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలలో నంబర్ వన్ హీరోల రేసులో ఉన్నారు.
బన్నీ తర్వాత సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. మరోవైపు బన్నీకి రెగ్యులర్ బెయిల్ లభించడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పాలి. అల్లు అర్జున్ మరిన్ని భారీ రికార్డులను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ లభించినా కోర్టు కొన్ని షరతులు విధించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది సెకండాఫ్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటించనున్నారు. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. బన్నీ త్రివిక్రమ్ పాన్ ఇండియా స్థాయిలో తర్వాత ప్రాజెక్ట్ లతో సత్తా చాటాలని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు. బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.