ఎన్టీఆర్ ద‌గ్గ‌ర ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయిన హీరోయిన్‌.. పాపం...!

RAMAKRISHNA S.S.
సప్త సాగరాలు దాటి సినిమాతో అందరిని ఆకట్టుకుంది రుక్మిణి వసంత్‌. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడలేదు. కానీ చాలామందికి ఫేవరెట్. దానికి కారణం హీరోయిన్ రుక్మిణి తన సంప్రదాయ లుక్కుతో అందరి హృదయాలు కొల్లగొట్టింది. దీంతో ఆమెకు అవకాశాలు కట్టాయి. ఆమె చేతుల్లో రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్‌ సినిమా .. రెండోది కాంతారా 2 దాంతో పాటు నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు తీసుకుంది. ఎన్టీఆర్ సినిమా అంటే దాదాపు సెటిల్మెంట్ కి దగ్గరకు వచ్చేసినట్టే. పైగా ప్రశాంత్ నీల్ మూవీ దాంతో పాటు కాంతారా 2 కూడా ఈ రెండు సినిమాలు చాలు రుక్మిణి స్టార్ డం ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ..!

అయితే ఈ రెండు సినిమాల ఇప్పుడు రుక్మిణి ముందరికాళ్ళకు బంధం వేసినట్టు అయింది. ఎన్టీఆర్ సినిమా పూర్తి అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని అగ్రిమెంట్లో ఉందట. ప్రశాంత్ నీల్ చాలా నిదానంగా సినిమాలు చేస్తూ ఉంటాడు. ఆయనకు ఎప్పుడు డేట్లు కావాలో ఆయనకే తెలియదు .. కాబట్టి అందరినీ లాక్ చేసి పడేస్తాడు. కాంతరా 2 విషయంలోను ఇదే జరిగింది. తన సినిమా అయ్యేంతవరకు మరో సినిమా చేయకూడదని రూల్ పెట్టాడట. దానికి కూడా రుక్మిణి ఓకే చెప్పిందట. ఈ రెండు సినిమాలతోనే ఆమె ఇప్పుడు సతమతమవుతుంటే ఆమె ఒప్పుకున్న చిన్నాచితకా సినిమాలు మరో నాలుగైదు ఉన్నాయి.

వాళ్లంతా ఇప్పుడు డేట్ ల కోసం క్యూ కట్టారు. ఎన్టీఆర్ సినిమా కోసం అగ్రిమెంట్ చేస్తున్నప్పుడే రుక్మిణి డిసైడ్ అవ్వాల్సింది .. మిగిలిన సినిమాలు చేయకూడదని ..! కానీ వచ్చిన అడ్వాన్స్ లు అన్నీ తీసుకుంది. ఇప్పుడు వాళ్లకు సమాధానం చెప్పలేక సతమతమవుతోంది. ఒక్క రుక్మిణి విషయంలోనే కాదు చాలామంది హీరోయిన్లు విషయంలో ఇదే సీన్ నడుస్తోంది. పెద్ద హీరో సినిమాలో ఛాన్స్ వచ్చింది కదా అని రెడీ అయిపోతున్నారు .. కానీ ఎగ్రిమెంట్లు మాత్రం వాళ్ళని అరెస్టు చేసి పడేస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ సినిమా ఎప్పుడు మొదలవుతుందో .. ఎప్పుడు పూర్తవుతుందో రుక్మిణి మిగిలిన సినిమాలుకు ఎప్పుడు డేట్లు ఇస్తుందో అర్థం కాని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: