గోపీచంద్‌కు హీరో అవ్వ‌డం ఇష్టంలేదా.. ఆ ఒక్క మాట కోస‌మే సినిమాల్లోకి వ‌చ్చాడా...!

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ హీరో గోపీచంద్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విలన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర్వాత‌ హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఒకప్పుడు వరుస హిట్ సినిమాలు తో బిజీగా ఉన్న ఈ హీరోకు ఇప్పుడు సక్సెస్ సినిమాలు లేవు. వరుసగా రామబాణం - బీమా - విశ్వం లాంటి సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. గోపీచంద్ కు చివరగా వచ్చిన సూపర్ హిట్ సినిమా ఏది అని ప్రశ్నించుకుంటే ? పది యేళ్ల‌ క్రితం వచ్చిన లౌక్యం సినిమా అని చెప్పాలి. ఆ సినిమా త‌ర్వాత‌ గోపీచంద్ న‌టించిన ఎన్నో సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి .. అయినా ఒక్క హిట్ కూడా ప‌డ‌డం లేదు. ఇక మ్యాచో హీరో గోపీచంద్ ఎవరో కాదు ? దివంగత దర్శకుడు తొట్టెంపూడి కృష్ణ ( టి. కృష్ణ ) వారసుడు. తన తొలి సినిమా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన తొలివలపు తో అందరినీ ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత తేజ దర్శకత్వంలో జయం .. ఆ తర్వాత వర్షం సినిమాలో విలన్గా చేసి తన నటనలో మరో కోణాన్ని చూపించాడు. కెరీయ‌ర్ పరంగా గోపీచంద్ కు బ్రేక్ ఇచ్చింది మాత్రం యజ్ఞం. ఆ తర్వాత రణం సినిమా ... ఆంధ్రుడు కూడా బాగా ఆడాయి. కొద్దిరోజులుగా ఆక్సిజన్ - ఆరడుగుల బుల్లెట్టు - చాణక్య - పంతం లాంటి అతిపెద్ద డిజాస్టర్లు గోపీచంద్ ఖాతాలో పడ్డాయి. మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమాతో కూడా నిరాశపరిచాడు. అసలు గోపీచంద్ కు సినిమాల్లోకి రావడం ఎంత మాత్రం ఇష్టం లేదట. తండ్రి ఒకప్పుడు డైరెక్టర్ ... గోపీచంద్ అన్న ప్రేమ్చంద్ కూడా డైరెక్టర్. ఒకటి రెండు సినిమాల కు ప్రేమ్చంద్ డైరెక్టర్గా పనిచేశాడు. ప్రేమ్‌చంద్ యాక్సిడెంట్లో కన్నుమూశాడు. తన కుటుంబం నుంచి ఇండస్ట్రీలో ఒక్కరైనా ఉండాలని తండ్రికి బలంగా కోరిక ఉండేదట. ఆ కోరిక కారణంగానే గోపీచంద్ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి హీరోగా సెటిల్ అయిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: