100 కోట్లు దాటిన టాలీవుడ్ హీరోయిన్ ఆస్తులు ,?

frame 100 కోట్లు దాటిన టాలీవుడ్ హీరోయిన్ ఆస్తులు ,?

Veldandi Saikiran
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న రష్మిక వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతోంది. 


ప్రస్తుతం ఈ చిన్నది వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా పుష్ప-2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రష్మిక ఆ సినిమా అనంతరం చావా సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ ఈ బ్యూటీ భారీగా ఆస్తులను సంపాదిస్తోంది. అంతేకాకుండా ఒక్కో సినిమాలో నటించినందుకు దాదాపు పది కోట్లకు పైనే రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందట.



ఇక రష్మిక మందనకు విపరీతంగా క్రేజ్ ఉండడంతో దర్శక నిర్మాతలు సైతం రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఓకే చెబుతున్నారట. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. రష్మిక ఇప్పటివరకు సినిమాలలో నటించి రూ. 70 కోట్లకు పైనే ఆస్తులను సంపాదించినట్టుగా ఫోర్బ్స్ సంస్థ వెల్లడించింది. త్వరలోనే ఈ ఆస్తులు రూ. 100 కోట్లకు పైనే చేరుకునే అవకాశాలు ఉన్నట్లుగా అంచనాలు వేస్తున్నారు.


ఇక రష్మికకు హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, గోవా, కూర్గ్ వంటి నగరాల్లో ఖరీదైన భవనాలు ఉన్నట్లుగా సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ చిన్నది సినిమాల ద్వారా భారీగా ఆస్తులను కూడబెడుతుంది. దక్షిణాది హీరోయిన్లలో సంపాదనపరంగా, నటనపరంగా నెంబర్ వన్ రష్మికనే అని ఫోర్బ్స్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ చిన్న దానికి సంబంధించి ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: