ఉస్తాద్ భగత్ సింగ్ : స్క్రిప్ట్ లో మార్పులు.. నిర్మాత కీలక కామెంట్స్..!!

frame ఉస్తాద్ భగత్ సింగ్ : స్క్రిప్ట్ లో మార్పులు.. నిర్మాత కీలక కామెంట్స్..!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు ఫ్యాన్స్ లో ఉండే ఉత్సాహమే వేరు.. ఫ్యాన్స్ కి ఆరోజు పండగే.. కానీ ప్రస్తుతం పవన్ రాజకీయాలలో బిజీగా ఉండటం వలన సినిమాలు చేసే పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం పవన్ ఎలాంటి కొత్త సినిమాలకి సైన్ చేయకపోయిన గతంలో తాను కమిటైన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు.పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ భారీ హిట్ కావడంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించడానికి డైరెక్టర్ హరీష్ శంకర్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా కూడా పరిస్థితులు మాత్రం అనుకూలించడం లేదు.


అయితే ఇటీవల ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది.. అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ‘రాబిన్ హుడ్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కల్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ మా ఆరవ సినిమాగా పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ కాబోతోంది. పవన్ సినిమా అంటే ఏ పాన్ ఇండియా బజ్ కూడా సరిపోదు అని ఆయన అన్నారు. హరిష్ శంకర్ ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ చేసినట్లు ఆయన తెలిపారు.. ఈ సినిమా కథ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలిపారు..

ఇక పవన్ కల్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారా అని మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాము.
ఎలాగైనా ఆ మూవీ షూటింగ్ ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.. అయితే తేరి బాలీవుడ్ రీమేక్ ఫ్లాప్ అవ్వడంతో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ మార్చి కొత్త స్క్రిప్ట్ రెడీ చేశాడనే ప్రచారం జోరుగా నడుస్తుంది. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ త్వరలో క్లారిటీ ఇవ్వనున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: