‘ధురంధర్’ : ఫస్ట్ వీక్‌లోనే పుష్ప 2 రికార్డును లేపే అవతల పడేసింది..!
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ మరియు 'ఉరి' చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ “ ధురంధర్ ” ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఊహకందని సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం హిందీ భాషలోనే విడుదలైనా ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు చూస్తుంటే బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సెన్సేషన్ 'పుష్ప 2' సెట్ చేసిన రికార్డులను ఈ సినిమా క్రాస్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పుష్ప 2 రికార్డుల వేట :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' హిందీ మార్కెట్లో అడుగుపెట్టి కనీవినీ ఎరుగని రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మొదటి వారం వసూళ్ల విషయంలో పుష్ప 2 ఒక యూనిక్ బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. కేవలం ఏడు రోజుల్లోనే 199 కోట్ల నెట్ వసూళ్లు సాధించి, ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అయితే, ఇప్పుడు "ధురంధర్" ఆ రికార్డును అధిగమించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
ధురంధర్ సరికొత్త రికార్డు
ఓపెనింగ్స్ మినహా, పుష్ప 2 నెలకొల్పిన దాదాపు అన్ని ప్రధాన రికార్డులను రణ్వీర్ సింగ్ తన 'ధురంధర్' చిత్రంతో బ్రేక్ చేస్తున్నారు. పుష్ప 2 వారం రోజుల్లో సాధించిన 199 కోట్ల రికార్డును బద్దలు కొడుతూ, ధురంధర్ సింగిల్ వీక్‌లోనే 200 కోట్ల మార్కును దాటేసింది. ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ లభించినప్పటికీ, ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అనేది ట్రేడ్ వర్గాల అంచనాలను మించిపోయింది. సాధారణంగా 'ఏ' సర్టిఫికెట్ సినిమాలకు ఆడియన్స్ పరిమితి ఉంటుంది, కానీ ధురంధర్ విషయంలో మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్ మరియు రణ్వీర్ సింగ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, గూస్‌బంప్స్ వచ్చే స్పై ఎలిమెంట్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, ధురంధర్ కేవలం పుష్ప 2 రికార్డులనే కాకుండా, బాలీవుడ్‌లోని టాప్ గ్రాసర్స్ జాబితాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని వందల కోట్ల క్లబ్‌లో చేరుతుందో చూడాలి.