అందరిని ఆకట్టుకుంటున్న "‘నీలకంఠ" టీజర్.. మాస్టర్ మహేంద్రన్ యాక్టింగ్ వేరే లెవల్..చించిపడేశాడు(వీడియో)..!
ఇక ఇప్పుడు అదే మహేంద్రన్, హీరోగా మారి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘నీలకంఠ’. ఈ చిత్రానికి రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించగా, ఇందులో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించారు. అదేవిధంగా, ప్రముఖ నటి స్నేహ ఉల్లాల్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనుండటం విశేషం.
ఈ చిత్రాన్ని ఎల్‌ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనివాసులు, వేణుగోపాల్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 2న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడగా, తాజాగా మేకర్స్ నీలకంఠ ప్రమోషన్స్‌ను అధికారికంగా ప్రారంభించారు.ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. టీజర్‌ను గమనిస్తే, శ్రవణ్ అందించిన డీవోపీ సినిమాకు ప్రధాన బలంగా కనిపిస్తోంది. విజువల్స్ చాలా రిచ్‌గా, సినిమాటిక్ ఫీల్‌తో ఆకట్టుకుంటున్నాయి. అలాగే ప్రశాంత్ బిజె అందించిన సంగీతం టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేలా ఉంది. అంతేకాదు, నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చేసినట్టు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.
నైజాం ప్రాంతంలో ఈ సినిమాను గ్లోబల్ సినిమాల్ సంస్థ విడుదల చేయనుండటం గమనార్హం. మొత్తంగా టీజర్ చూస్తుంటే, ‘నీలకంఠ’ సినిమాతో టాలీవుడ్‌లో మహేంద్రన్‌కు ఒక గట్టి హిట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది.బాల నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేంద్రన్, ఇప్పుడు హీరోగా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి. టీజర్ మాత్రం సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. మరి మీరు కూడా నీలకంఠ టీజర్‌పై ఓ లుక్ వేయండి, మహేంద్రన్ కొత్త ప్రయాణానికి మీ అభిప్రాయం తెలియజేయండి.