మీనాక్షి నటించిన అన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు.. రికార్డు కొట్టేలా ఉంది..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇక ప్రస్తుతం ఈమె అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు తెలుగులో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. మీనాక్షి "ఇచ్చట వాహనములు నిలపరాదు" సినిమా తర్వాత రవితేజ హీరోగా రూపొందిన కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించింది.

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి తో పాటు డింపుల్ హయాతి కూడా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఇందులో మీనాక్షి అదిరిపోయే రేంజ్ అందాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కించింది. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తో పాటు శ్రీ లీల కూడా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఈ నటి కొన్ని రోజుల క్రితం విశ్వక్సేన్ హీరోగా రూపొందిన మెకానిక్ రాఖీ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో కూడా ఈమెతో పాటు శ్రద్ధ శ్రీనాథ్ కూడా హీరోయిన్గా నటించింది.

ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో మీనాక్షి తో పాటు ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇలా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాల్లో ఎక్కువ సినిమాల్లో ఈమెతో పాటు మరో హీరోయిన్ కూడా నటించిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: