పెళ్లి కూతురు అయిన ప్రియాంక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!
పలువురు నటీనటులు తాము ఎంతగానో ఇష్టపడిన వ్యక్తిని కుటుంబ సమక్షంలో పెళ్లాడారు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరిపోయింది 'వదినమ్మ' ఫేమ్ ప్రియాంక నాయుడు. ఆమె మరో సీరియల్ ఆర్టిస్ట్ మధుబాబును పెళ్లాడబోతోంది. గత కొన్నినెలల క్రితమే తాము పెళ్లిచేసుకోబోతున్న స్వయంగా మధుబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.చాలాకాలం పాటు ప్రేమలో మునిగితేలిన ప్రియాంక నాయుడు- మధుబాబు తాజాగా నవ వధూవరులుగా మారారు. పెళ్లి చేసుకున్నారు.
వీరిద్దరూ చాలా కాలం ప్రేమించుకున్నారు.. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లికి రెడీ అయ్యారు.అభిషేకం సీరియల్ ద్వారా ఫేమస్ అయిన మధుబాబు.. మంగమ్మగారి మనవడు సీరియల్‌తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రియాంక నాయుడు విషయానికి వస్తే.. వదినమ్మ సీరియల్‌లో 'సిరి' క్యారెక్టర్‌తో తెలుగు బుల్లితెరకు బాగా దగ్గరైంది. ఈ సీరియల్ లో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొడుతోంది.. దీంతో బాగా ఫేమస్ కూడా అయ్యింది.ప్రస్తుతం పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ లోకి ఎంటర్ అయ్యి ఎంజాయ్ చేస్తుంది..ఆమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..