నోయల్-స్వాతి మధ్య ఏం జరిగింది..?

Suma Kallamadi
బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకెళ్తుంది బిగ్ బాస్ షో. ఈ షో ఐదో వారంలోకి అడుగు పెట్టడంతోనే ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా మారింది. ఇక నోయల్ అమ్మా రాజశేఖర్ ని నామినేట్ చేస్తూ ఇలా మాట్లాడారు. స్వాతి దీక్షిత్‌ని నామినేట్ చేసి మొక్కను పెరగకుండానే ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యారని అందుకే రాజశేఖర్ మాస్టర్‌ని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు నోయల్. అయితే ఇదే పాయింట్‌పై నోయల్‌కి సొహైల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.
అయితే స్వాతి విషయంలో నోయల్ ఎందుకు అంతా బాధ పడిపోతున్నాడు. ఆమె ఎలిమినేషన్ అప్పుడు కూడా అందరూ బాగానే ఉన్నా.. నోయల్ మాత్రం ఆమెను పట్టుకుని ఎందుకు బోరు బోరున ఏడ్చేశాడు. అయితే కట్టప్ప ఎవరో మాటవరుసకి చెప్పాలని బిగ్ బాస్ అన్నప్పుడు రాజశేఖర్ మాస్టర్ ఫీల్ అవుతారు. అలా అనడం తప్పు అన్నవాడే.. ఏకంగా ఆయన్నే నామినేషన్ ఎందుకు చేశాడు అంటూ నెటిజన్స్ పలు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక అసలు స్వాతి దీక్షిత్-నోయల్‌ల మధ్య ఏం జరిగింది. ఈ విషయానికి వస్తే.. అక్టోబర్ 3 శనివారం నాటి ఎపిసోడ్‌లో స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయినా సంగతి తెలిసిందే. ఇక్కడ నిజానికి స్వాతి నవ్వుతూనే హౌస్ నుంచి బయటకు వచ్చింది. పెద్దగా బాధపడినట్టుగా కనిపించలేదు ఆమె. కాని నోయల్ మాత్రం ఆమెను గట్టిగా పట్టేసుకుని బోరు బోరున ఏడ్చేశాడు. ఏడవద్దు అని ఆమె చెప్తుంటే కూడా పక్కకు వెళ్లి మరీ విలపించాడు నోయల్.
అంతేకాదు నోయల్ ఎందుకు అలా చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. అయితే తరువాత కూడా స్వాతి అతన్ని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఇక అనంతరం నోయల్ లోపలికి వెళ్లి రెడ్ లవ్ సింబల్ టెడ్డీని తీసుకువచ్చి దివికి చూపిస్తూ ఇది నీదేనా అని అడగడం కనిపించింది. ఆ తరువాత అదే లవ్ సింబల్‌ని పట్టుకుని స్వాతి దీక్షిత్ బయటకు రావడం చూశాం. ఆ లవ్ సింబల్ స్వాతి‌కి ఇచ్చింది నోయల్ అని క్లియర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: