చంద్రగిరి: టీడీపీ వర్సెస్ వైసీపీ.. మళ్లీ మొదలైన వార్..

Divya
రెండు తెలుగు రాష్ట్రాలలో నిన్నటి రోజున ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది.. అయితే తెలంగాణలో పరిస్థితులు అన్నీ సక్రమంగానే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓటింగ్ అయిపోయినప్పటికీ పలు ప్రాంతాలలో ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గడచిన కొన్ని గంటల క్రితం పల్నాడు నియోజకవర్గంలో నానా హంగామా జరగగా.. ఇప్పుడు తాజాగా తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో టిడిపి , వైసిపి నేతల మధ్య మరొకసారి దాడులు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ కారణంగానే  పలు ప్రాంతాలలో పోలీసులు సైతం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి..  పోలింగ్ ముగిసిన తర్వాత చాలా చోట్ల ఈవీఎం మిషన్ లను  స్ట్రాంగ్ రూమ్ లకు తరలించే పనిలో పడ్డారు.

అయితే ఈ సమయంలోనే చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి నాని పద్మావతి యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ ని సైతం పరిశీలించారు .. అయితే అనంతరం తిరిగి వస్తూ ఉండగా ఆయన పైన వైసిపి కార్యకర్తలు ఒక్కొక్కరుగా రాళ్లు , కర్రలతో దాడి చేసినట్లు తెలుస్తోంది.. దీంతో ఆయన కారు అక్కడికక్కడే ధ్వంసం అయినట్లుగా సమాచారం. అయితే అప్పటికి ఆయన వెంట ఉండి తిరిగిన వారు తిరగబడడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఆ తర్వాత టిడిపి మహిళా నేతలు యూనివర్సిటీ ఎదుట రహదారి పై బైఠాయించి కులపర్తి నాని పైన జరిగిన ఈ దాడిని సైతం వ్యతిరేకిస్తూ పలు రకాల నిరసనలను కూడా తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడి చేరుకొని అక్కడ పరిస్థితిని సైతం చక్కదిద్దే ప్రయత్నం చేశారు.. అయితే వైసిపి దాడిలో ఎవరికైనా గాయాలు అయ్యాయా లేవా అనే విషయం పైన ఇంకా పోలీసులు ఆరా తీస్తున్నారు.. ఓటింగ్ రోజున కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి .. ఇప్పుడు ఓటింగ్ అయిపోయిన కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించడంతో చాలామంది ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.. ముఖ్యంగా ఇప్పటివరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు యుద్దాలను తలపిస్తూ ఉండడం ప్రజలను మరింత ఇబ్బందులకు భయాందోళనలకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: