ఏపీ: వన్ మ్యాన్ ఆర్మీగా ఆ మొత్తం ప్లాన్‌ జగనే రచించారా..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13తో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటింగ్ సరళిని బట్టి ఈసారి మళ్లీ జగనే అధికారంలోకి వస్తారు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి జగన్ ని ఓడించేందుకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు చేతులు కలిపారు. భువనేశ్వరి, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇలా చంద్రబాబు అండ్ టీమ్‌ మొత్తం రాష్ట్రమంతటా జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ అతనిని గద్దె దించడానికి ప్రయత్నించారు. అయితే ఇంతమంది తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నా జగన్ మాత్రం అన్ని తానై ఏపీ అంతటా తిరిగారు. వన్ మ్యాన్ ఆర్మీగా గెలుపు బాధ్యతను మొత్తం తన భుజాలపైనే వేసుకున్నారు.
భారతి ఒక్కరే జగన్ కి కొంచెం సపోర్ట్ గా ఇచ్చారు. గతంలో వైఎస్ విజయమ్మ, షర్మిల జగన్‌కు మద్దతుగా ప్రచారం చేశారు కానీ ఇప్పుడు వారందరూ కూడా ఈ నాయకుడికి వ్యతిరేకమే అయ్యారు. ఇక ఎల్లో బ్యాచ్ కూడా జగన్ పై పెద్ద యుద్ధమే చేసింది. బాబు రాజకీయ అనుభవంతో వ్యవస్థలను తనకనుగుణంగా  మార్చుకునేందుకు ఎన్నో ఎత్తులు వేశారు. అయితే వీటన్నిటినీ జగన్ తిప్పి కొట్టారు. టీడీపీ+ కూటమిపైనే నెగిటివిటీ వచ్చేలాగా ఆయన అన్నీ ప్లాన్ చేశారు. గ్రౌండ్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు తన పార్టీ చేసిన మంచి పనులు, సంక్షేమ పథకాలు అందరికీ తెలిసేలా జగన్ ప్రవర్తించారు. సుదీర్ఘమైన ఇంటర్వ్యూ కూడా ఇచ్చి అనేక సందేహాలను క్లియర్ చేశారు.
మీ ఇంటికి మా పాలన వల్ల మంచి జరిగితేనే మాకు ఓటేయండి అనే నినాదంతో జగన్ ప్రజల్లో ఒక ఆలోచన కలిగించగలిగారు. జగన్ హయాంలో దాదాపు ప్రజలందరికీ లబ్ధి చేకూరింది. చంద్రబాబు హయాంలో ఎవరికీ లబ్ధి చేకూరిన దాఖలాలు లేవు. ఆ కారణం చేత ప్రజలు జగన్ కి ఓటు వేసి గెలిపించాలనే ఆలోచనకు వచ్చారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారు కానీ అవన్నీ ఆచరణ సాధ్యం కాదని జగన్ లెక్కలతో సహా చెప్పి జనాలు మోసపోకుండా చేశారు. మొత్తం మీద జగన్ సర్వశక్తులు ఒడ్డి, సకల యుక్తులు పన్ని ప్రత్యర్థులపై పోరాడారు. జూన్ 4న ఆయనకు అనుకూలంగానే ఫలితం నిలబడుతుందని చాలామంది బలంగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: