మెదక్ : ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ నమోదయిందంటే?
ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఇంకోవైపు బిఆర్ఎస్ పార్టీ కంచుకోటను కాపాడుకునేందుకు కేసిఆర్ కూడా ఇక మెదక్‌లో విజయం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మరోవైపు బిజెపి తమదే విజయం అంటూ ధీమాతో ఉంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా తేల్చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ నమోదయింది అన్నది హాట్ టాపిక్ గా మారింది.
మొత్తంగా చూసుకుంటే అటు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని అన్ని నియోజకవర్గాలలో కలిపి 73.63% పోలింగ్ నమోదయింది. ఇక ఎక్కువగా నర్సాపూర్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం నమోదు కావడం గమనార్హం. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే గజ్వేల్ లో 73.15% పోలింగ్ నమోదయింది. సిద్దిపేటలో కూడా 73.15% పోలింగ్ నమోదు కావడం గమనార్హం. దుబ్బాకలో 80.22 శాతం మెదక్‌లో 79.61%, నర్సాపూర్‌లో 83.73%, పటాన్చెరులో 61%, సంగారెడ్డిలో 79.07% పోలింగ్ నమోదయింది. అయితే గత ఎలక్షన్స్ తో పోల్చి చూస్తే ఈసారి పోలింగ్ శాతం కాస్త ఎక్కువే ఉంది. దీంతో ఈసారి ఎవరు గెలిచినా భారీ మెజారిటీతో గెలుస్తారు అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.