"డబల్ ఈస్మార్ట్" టీజర్ రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కొంతకాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక పూరి జగన్నాథ్ కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్ అనే పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇక వరుస అపజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయిన రామ్ మరియు పూరి కాంబోలో ప్రస్తుతం డబల్ ఈస్మార్ట్ అనే మూవీ రూపొందుతుంది.
 

ఈ మూవీ కొంత కాలం క్రితం బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ లో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనుండగా ... మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

ఇకపోతే రేపు అనగా మే 15 వ తేదీన రామ్ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ను 85 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆఫీషియల్ గా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇందులో రామ్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: