బిగ్ బాస్ 4 కంటెస్టెంట్‌గా ఆ హీరోయిన్ ఫిక్సా...?

Suma Kallamadi

అనుకున్నదానికంటే ఎక్కువగా ప్రేక్షకాదరణ పొంది ముందుకు వెళ్తున్న తెలుగు షో "బిగ్ బాస్". ఈ షో రియాల్టీ షో కు ముందుగా పరిచయం తక్కువ అయినప్పటికీ, దీనికి తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. రోజుకు ఓ థీమ్ తో ఆటపాటలను పెట్టి ప్రేక్షకులను కట్టిపడేసింది బిగ్ బాస్ షో. బాలీవుడ్ లో ఇప్పటికే పదుల సంఖ్యలో సీజన్ లను నిరవహించగా, బిగ్ బాస్ తెలుగులో మాత్రం కేవలం మూడు సీజన్లను మాత్రమే విజయవంతంగా నిర్వహించింది. అయితే ఈ బిగ్ బాస్ 4 సీజన్ లో ఎన్టీఆర్ కుమార్తె రాబోతుందని ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఇలాంటి కొన్ని సంఘటనలు ఇప్పుడు మనం చూద్దామా. 

 


ఎన్నో అనుమానాల మధ్య మొదలైన బిగ్ బాస్ షో అప్పటివరకు కేవలం సినిమా హీరోగానే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ షో ను ప్రేక్షకులకి తీసుకెళ్లడంలో భారీ గా విజయం సాధించాడు. దీంతో తెలుగులో బిగ్ బాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత రెండో సీజన్ లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశాడు. ఎంత న్యాచురల్ గా యాక్టింగ్ చేస్తాడో, అంతే నాచురల్ గా హోస్టింగ్ చేశాడు నాని. దీంతో ఆ సీజన్ కూడా ఓ రకంగా భారీగానే హిట్ అయిందని చెప్పవచ్చు. ఇక చివరగా నాగార్జున హోస్ట్ గా నిర్వహించగా అనేక విభేదాల నడుమ సీజన్ సాగిన మొత్తానికి సూపర్ హిట్ అయిందని చెప్పవచ్చు.

 


అయితే ఇక రాబోయే నాలుగో సీజన్ కు సంబంధించి ప్రస్తుతం అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ కు ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారో, ఎవరెవరు పాల్గొంటారు అన్న వాటిపై పూర్తి విషయాలు తెలియకపోయినా అనేక ఊహాగానాలు మాత్రం బయటికి వస్తున్నాయి. అయితే తాజాగా ఓ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే హీరోయిన్ పూనమ్ బజ్వా రాబోయే బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా రాబోతుందట. ఈవిడ చివరగా ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి గా నటించింది. అయితే బిగ్ బాస్ లో పాల్గొనేందుకు ఈవిడ బిగ్ బాస్ నిర్వాహకుల నుండి అది పెద్ద మొత్తంలో అందుకోపోతుందని అని టాలీవుడ్ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: