ప్రపంచ క్రికెట్ కి సవాల్ ఆ “భారతీయుడు బౌలింగ్”

NCR

సహజంగా బౌలింగ్ అంటే క్రికెట్ ఆడే వారికి గాని ఆడని వారికి కాని తెలిసింది ఎడమ చేతి వాటం, లేదా కుడి చేతి వాటం , అదేవిధంగా ఫాస్ట్ ,స్పింన్ ,స్వింగ్  ,ఇలా రకరకాలుగా ఉంటాయి..కానీ మీరు ఎప్పుడన్నా 360 డిగ్రీ లో బౌలింగ్ చూశారా..అసలు ఈ మాట విన్నారా..ఇలాంటి ఘటనే ఇప్పుడు ప్రపంచ క్రికెట్ మేధావులని షేక్ చేస్తోంది. వీడు ఎక్కడోడురా బాబు అంటే భారత్ కి చెందినా వాడు అంటూ సమాధనం ఇస్తున్నారు..పూర్తి వివరాలలోకి వెళ్తే.

 

ఉత్తరప్రదేశ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ శివసింగ్ బౌలింగ్ శైలి ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్నే కుదిపేస్తోంది... సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా కల్యాణిలో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో శివసింగ్ గుండ్రంగా తిరిగి బౌలింగ్ వేశాడు. రన్‌ప్ ప్రారంభించిన శివసింగ్ క్రీజు దగ్గరికి వచ్చేసరికి 360 డిగ్రీల్లో చుట్టూ తిరిగి బౌలింగ్ వేశాడు. అవాక్కైన అంపైర్ దానిని ‘డెడ్‌బాల్’గా ప్రకటించాడు. దీంతో షాకవడంతో యూపీ ఆటగాళ్ల వంతైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

ఆ బౌలర్ యాక్షన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది..కొంతమంది దీనిని అసహజ బౌలింగ్ అంటుంటే..కొందరు మాత్రం ఇది సరైన పద్దతే అంటున్నారు..ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు..అయితే ఈ విషయంలో స్పందించిన లండన్‌లోని అతి పురాతన క్రికెట్ క్లబ్.. మ్యారిల్‌బోన్ క్రికెట్ క్లబ్. బౌలర్ రనప్ ఎలా ఉండాలనేది ‘క్రికెట్‌లా’లో లేదని పేర్కొంటూ కొన్ని నిబంధనల గురించి వివరించింది. 360  డిగ్రీల బౌలింగ్ బౌలర్ సహజ శైలి అయితే అంపైర్ పట్టించుకోవాల్సిన పనిలేదని, ఒకవేళ బ్యాట్స్‌మన్‌ను భయపట్టేందుకే అలా చేసి ఉంటే మాత్రం తప్పేనని తేల్చి చెప్పింది.ఇప్పుడు అతడి బౌలింగ్ ని ఒప్పుకుని తీరాల్సిందే అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అతడో చర్చకి దారితీశాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: