“భారత్ జోరుకు” సఫారీల “బ్రేక్”...

Bhavannarayana Nch

నాలుగో వన్డే మ్యాచ్ కూడా భారత్ దే అనుకున్నారు అందరూ..కానీ మధ్యలో మాకు అవకాశం ఇవ్వండి అన్నట్టుగా సఫారీలు ఈ వన్డే సీరీస్ లో మొదటి విజయాన్ని నమోదు చేశారు..జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో భారత్‌పై సఫారీలు  విజయం సాధించారు...అయితే భారత్ టాస్ గెలిచి మొదటగా బ్యాటిగ్ చేసి సఫారీల ముందు 290 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు..అయితే వర్షం కారణంగా ఆ లక్ష్యాన్ని 28 ఓవర్లలో 202 కి కుదించారు.

 

అయితే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత జట్టు సఫారీలకి  290 పరుగులు చేశారు..మ్యాచ్ ఆరంభం నుంచీ  నిర్దేశించారు..అయితే లక్ష్య చేధనలో ఓపెనర్లుగా దిగిన  మాక్క్రమ్ , ఆమ్లా దూకుడుగా ఆది జట్టు ని విజయం స్కోర్ పెంచే దిశగా వెళ్ళడం మొదలు పెట్టారు..అయితే 7.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 43 పరుగులు చేసిన దశలో వర్షం ఆటకు అడ్డుగా నిలిచింది.వర్షం కారణంగానే ఒవర్లని కుదించి 28 ఓవర్లలో 202 పరుగుల లక్ష్యాన్ని సఫారీల టార్గెట్ గా ఉంచారు


అయితే మరో...వర్షం కారణంగా 28 ఓవర్లలో 202 పరుగులకు కుదించిన లక్ష్యాన్ని మరో 5 వికెట్లు మిగిలి ఉండగానే 25.3 ఓవర్లలో విజయాన్నీ సొంతం చేసుకున్నారు సఫారీలు..అయితే ఇప్పుడు ఆరు వన్డేల సీరీస్ కి గాను 1-3 గా నిలిచింది..అయితే ఈ మ్యాచ్ లో మరొక విశేషం ఏమిటంటే..

 

కేన్సర్ బాధితుల కోసం సఫారీలు ఆడిన పింక్ వన్డేకు మంచి ఆదరణ ఎంతగానో లభించింది...స్టేడియం మొత్తం గులాబీ వర్ణం అయిపొయింది.. డివిలియర్స్ (26 పరుగులు, 18 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు)మొదట్లో చెలరేగి ఆడినా సరే తరువాత..పాండ్య బౌలింగ్‌లో రోహిత్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...చివరిలో హెన్రిక్ క్లేసన్  27 బంతుల్లో..5 ఫోర్లు, 1 సిక్సర్ తో కలిపి 45 పరుగులు చేశాడు.. డేవిడ్ మిల్లర్ 28 బంతుల్లో...4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39  పరుగులు చేశాడు.. అనంతరం రంగంలోకి దిగిన  పెహ్లువాయో  5 బంతుల్లో..3 సిక్సర్లు, 1 ఫోర్ తో “23” పరుగులు చేసి మరో   బ్యాట్ 15 బంతులు మిగిలుండగానే తమ జట్టుకి విజయం అందించాడు...అయితే ఈ సీరీస్ లో గెలవాలంటే భారత్ ఒక్క విజయం సాధించితే చాలు..సఫారీలు కనుకా రెండు మ్యాచ్‌లలో గెలిస్తే సీరీస్ సమం అవుతుంది.

 







 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: