ఐపీఎల్ హిస్టరీలో.. ఎక్కువ సంపాదించింది వీళ్లే.. టాప్ లో ధోని, కోహ్లీ కాదు.. ఎవరంటే?

praveen
భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ టి20 లీగ్ ఆ రేంజ్ లో గుర్తింపుని సంపాదించుకుంది. ఒక సాదాసీదా టీ20 లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ ఇక ఇప్పుడు వరల్డ్ క్రికెట్లోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది  అయితే ఈ టి20 లీగ్ ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ పాలిట వరంలా మారిపోయింది. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి జాతీయ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాలని ఆశపడే ప్రతి యంగ్ ప్లేయర్ కూడా ఐపీఎల్లో ఛాన్స్ దక్కించుకొని సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాడు.

 అంతేకాదు ఇక ఐపీఎల్ భాగమయ్యే ఆటగాళ్లకు పంట పండుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క సీజన్లో క్లిక్ అయ్యాడంటే ఆ తర్వాత కోట్ల రూపాయల ఆదాయం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది  యువ ఆటగాళ్లకు సైతం ఈ మధ్యకాలంలో ఫ్రాంచైజీలు పెద్దపీట వేస్తూ కోట్ల రూపాయలు ధర పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి  అయితే ఇక ఇప్పటికే ఎంతోమంది ఆటగాళ్లు ఇలా కోట్ల రూపాయలు ఐపీఎల్ ద్వారా సంపాదించారు అన్న విషయం అందరికీ తెలుసు.

 ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఇక అత్యధిక పారితోషకాన్ని అందుకుని ఎక్కువ అర్జించిన ఆటగాడు ఎవరు అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఈ లిస్టులో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపిఎల్ ద్వారా ఎక్కువ సంపాదించిన ఆటగాడిగా మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ ద్వారా 194.6 కోట్ల రూపాయలు సంపాదించాడు. టోర్నీ చరిత్రలో ఇక ఇదే అత్యధికం. ఇక ఆ తర్వాత చెన్నై మాజీ కెప్టెన్ ధోని రూ. 188.84 కోట్లు, విరాట్ కోహ్లీ రూ. 188.2 కోట్లు,  రవీంద్ర జడేజా రూ. 125.01 కోట్లు, సునీల్ నరైన్ 113.25 కోట్లు అర్జంచి టాప్ ఫైవ్ లో ఉన్నారు. వీరి తర్వాత సురేష్ రైనా, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్, మాక్స్వెల్, యువరాజ్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl

సంబంధిత వార్తలు: