మోగ్లీ మూవీ రివ్యూ & రేటింగ్!
ఈ ఏడాది ప్రేక్షకుల్లో క్రేజ్ సొంతం చేసుకున్న సినిమాలలో మోగ్లీ మూవీ ఒకటి. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్ గా నటించడంతో అంచనాలు పెరిగాయి. రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ :
మురళీకృష్ణ అలియాస్ మోగ్లీ (రోషన్ కనకాల) బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా జీవిస్తుంటాడు. ఊరి పక్కన ఉండే అడవిని అమ్మగా భావించే మోగ్లీ ఎస్సై కావాలనే భారీ లక్ష్యాన్ని ఎంచుకుంటాడు. ఒక సినిమాలో డూప్ గా యాక్ట్ చేసిన మోగ్లీ జాస్మిన్ (సాక్షి) ను చూసి ప్రేమలో పడతాడు. జాస్మిన్ మాట్లాడలేదని వినలేదని తెలిసినా ఇద్దరి మనస్సులు కలుస్తాయి. క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) జాస్మిన్ పై కన్నేసి ఆమెను లోబరచుకోవాలని అనుకుంటాడు. చివరకు నోలన్ తన చెడు లక్ష్యాన్ని సాధించాడా? ఈ సమస్యలను ఏ విధంగా అధిగమించాడు? చివరకు ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
అడవి నేపథ్యంలో సాగే ప్రేమకథగా మోగ్లీ తెరకెక్కింది. కర్మఫలం అనే అంశాన్ని తీసుకున్న దర్శకుడు అందుకు సంబంధించిన సన్నివేశాలను తెరపై అద్భుతంగా చూపించాడు. రామాయాణంను ఇన్స్పిరేషన్ గా తీసుకుని దర్శకుడు ఈ కథ రాసుకున్నాడని చెప్పవచ్చు. అయితే దర్శకుడు కొత్తదనం కోసం ప్రయత్నించినా ప్రేక్షకులు మెచ్చేలా మాత్రం సినిమా లేదనే చెప్పాలి. 2 గంటల 25 నిమిషాల రన్ టైం కూడా ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. సినిమాలో ల్యాగ్ అనిపించే సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి.
రోషన్ కనకాల మొదటి సినిమా బబుల్ గమ్ తో పోలిస్తే మెరుగయ్యాడు. హీరోయిన్ సాక్షి తన నటనతో ప్రత్యేకతను చాటుకుంది. బండి సరోజ్ కుమార్ పవర్ ఫుల్ విలన్ గా ఈ సినిమాలో కనిపించరు. నటుడిగా బండి సరోజ్ కుమార్ కు ఈ సినిమా ప్లస్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించే విషయంలో మాత్రం దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.
కాల భైరవ మ్యూజిక్, బీజీఎంతో ప్రేక్షకులను మెప్పించలేదు. రామ మారుతి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అయింది. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా బెటర్ రిజల్ట్ ను అందుకుని ఉండేది. దర్శకుడు సందీప్ రాజ్ కలర్ ఫోటో సినిమాతో ప్రత్యేకతను చాటుకున్నా ఈ సినిమాతో ముద్ర వేయలేకపోయారు.
బలాలు : రోషన్, బండి సరోజ్ కుమార్, సాక్షి యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, సెకండాఫ్ లో కొన్ని సీన్స్
బలహీనతలు : ఫస్టాఫ్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే
రేటింగ్ : 2.5/5.0