"ఆదర్శ కుటుంబం" సినిమాను త్రివిక్రమ్ ఆ హీరోతో చేయాలనుకున్నాడా..? ఎందుకు మిస్ అయ్యింది..?
అయితే, ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే, ఫ్యాన్స్ ఒక విషయాన్ని ఎక్కువగా చర్చిస్తున్నారు. ఇది, గతంలో త్రివిక్రమ్ - రామ్ పోతినేనితో ఒక కథను అనుకున్నారని, కానీ ఆ కథను ఫ్యామిలీ కథగా మార్చడం వల్ల రామ్ పోతినేని ఆ కథను రిజెక్ట్ చేశారని వార్తలు వినిపించాయి. అంటే, త్రివిక్రమ్ ఆ కథను రామ్ పోతినేని హీరోతో చేయాలనుకున్నా, ఆ కథ రిజెక్ట్ కావడం వలన ఆ ప్లాన్ మిస్ అయ్యిందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్ హాట్ టాపిక్ గా మారింది.
బహుశా కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి, వెంకటేష్ గారికి అనుకూలంగా సెట్ చేస్తున్నారని కూడా అభిమానులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో, ఈ విషయం ప్రస్తుతం హీట్ పెంచేస్తుంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్, చర్చలు చేస్తున్నారు. మొత్తం గా ఆదర్శ కుటుంబం సినిమా కోసం త్రివిక్రమ్ మొదట ఒక ఫ్యామిలీ కథను రామ్ పోతినేని హీరోతో చేయాలనుకున్నా, ఆ అవకాశము వాస్తవానికి వర్క్ అవ్వలేదని, తర్వాత వెంకటేష్ హీరోగా మార్చి, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతున్నారని సోషల్ మీడియాలో న్యూస్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీని పై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తాడు చూడాలి....!???