బాబర్ గుడ్ బై.. పాక్ కొత్త కెప్టెన్ గా ఊహించని ప్లేయర్.. ఇక దేవుడే కాపాడాలి?

praveen
ఇటీవల కాలంలో పాకిస్తాన్ క్రికెట్లో ఎంతటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఏ మార్పు జరుగుతుంది అని ఊహించడం కూడా కష్టంగా మారిపోయింది. కోచింగ్ సిబ్బంది దగ్గర నుంచి  ప్లేయర్ల వరకు అందరూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల వైట్ బాల్ కెప్టెన్ గా కొనసాగిన బాబర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ  నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకి కొత్త సారథిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 అయితే సొంత గడ్డపై జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇలా కొత్త సారధికి బాధ్యతలు అప్పగించడం అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్ గా బాబర్ వారసుడిగా పేరున్న మహమ్మద్ రిజ్వాన్ కు బాధ్యతలు అప్పగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కొత్త కెప్టెన్ గురించి ఇప్పుడు మరో ఆసక్తికర విషయం తెరమీదకి వచ్చింది.

 పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ కొత్త కెప్టెన్ కోసం ఇద్దరూ ఆటగాల్లను షార్ట్ లిస్ట్ చేసిందట. అందులో మహమ్మద్ రిజ్వాన్ పేరు లేనే లేదట. మొహసిన్ నక్వి  నేతృత్వంలోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కెప్టెన్సీ కోసం ఫకర్ జమన్, సౌద్ షకీల్ లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాక్ బోర్డు పెద్దలందరూ షకీల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇటీవల పాకిస్తాన్తో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో వైస్ కెప్టెన్ గా షకీల్ బాధ్యతలు చేపట్టాడు. బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఎంత ఘోర ఓటమిని చవి చూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినప్పటికీ ఇక అతనికి కెప్టెన్సీ అప్పగించేందుకు నిర్ణయించారట ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్దలు. ఇక ఈ విషయం తెలిసి ఇక పాకిస్తాన్ క్రికెట్ ను ఆ దేవుడే కాపాడాలి అంటూ ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: