తెలుగోళ్ళని తొక్కేస్తున్నారా.. బీసీసీఐ ఎందుకిలా చేస్తుంది?

frame తెలుగోళ్ళని తొక్కేస్తున్నారా.. బీసీసీఐ ఎందుకిలా చేస్తుంది?

praveen
ఇండియాలో క్రికెట్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్లు అటు భారత జట్టులోకి రావడం చూస్తూ ఉంటాం. కానీ తెలుగు క్రికెటర్ల విషయంలో మాత్రం అటు బీసీసీఐ ఎప్పుడు వివక్షపూరితంగానే వ్యవహరిస్తుంది అనే వాదన వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఎంతలా నిరూపించుకున్నప్పటికీ తెలుగు క్రికెటర్లకి భారత జట్టులో అతి తక్కువగా అవకాశాలు దక్కడం చూస్తూ ఉంటాం. గతంలో అంబటి రాయుడు దగ్గర నుంచి మొన్నటికి మొన్న తిలక్ వర్మ వరకు కూడా ఇదే జరుగుతూ వస్తుంది..

 అయితే తెలుగు క్రికెటర్లను తొక్కేస్తున్నారు సరైన అవకాశాలు ఇవ్వడం లేదు అన్నది మరోసారి నిరూపితం కాబోతుంది అన్నది తెలుస్తోంది.  ఇటీవల భారత జట్టు బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను క్లీన్స్వీప్ చేసింది. సీనియర్ల పోరాట స్ఫూర్తితో ఇక ఇప్పుడు టి20 సిరీస్ ని కూడా కైవసం చేసుకోవాలని సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ బృందం పట్టుదలతో ఉంది. అయితే తొలి టీ20 మ్యాచ్ లో జట్టు కూర్పుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే తొలిసారి టీం ఇండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ తుది జట్టులో చోటు దక్కించుకుంటారా లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

  జైష్వాల్, గిల్ కు విశ్రాంతి ఇవ్వడంతో ఓపెనర్ గా అభిషేక్ శర్మ సంజూలు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక వన్ డౌన్ లో కెప్టెన్ సూర్య ఆ తర్వాత రియాన్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ఆర్డర్లో వస్తారు. ఈ క్రమంలోనే ఫేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, దుబే తూది జట్టులో ఉండడంతో ఇక తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ని పక్కన పెట్టే అవకాశం ఉంది అన్నది తెలుస్తోంది. దీంతో ఇక తెలుగు క్రికెటర్లు ఎంత అద్భుతమైన ప్రదర్శన కనపరిచినప్పటికీ.. ఎప్పుడూ ఇలా పక్కన పెడుతూనే వస్తున్నారు అంటూ ఇక తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్‌తో తొలి టీ20కు భారత తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: