దేశంలోనే చిన్న ఎంపీ పెళ్లి తేజస్వి సూర్య పెళ్లి ఫిక్స్.. కాబోయే భార్య తెలుసా..!
సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఆర్ఎస్ఎస్ లో కీలకంగా వ్యవహరించేవారు. అనూహ్యంగా అతి చిన్న వయసులోనే 2019 లోక్సభ ఎన్నికలలో సదానంద గౌడ ప్రాథినిత్యం వహించిన బెంగళూరు దక్షిణ పార్లమెంటు స్థానాన్ని కొత్త వాళ్లకు ఇవ్వాలని బిజెపి కేంద్ర నాయకత్వం భావించింది. ఈ క్రమంలోని యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఎవరు ఊహించని విధంగా తేజస్వి సూర్య కు బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గ స్థానాన్ని కేటాయించింది. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తేజ స్వీ సూర్య ఘనవిజయం సాధించి చాలా చిన్న వయసులోనే ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టారు. ఐదేళ్లపాటు ఎంపీగా ఎలాంటి మరక లు లేకుండా తనదైన ముద్రవేశారు. మొన్నటి ఎన్నికలలో మరోసారి బిజెపి జాతీయ నాయకత్వం ఆయనకే సీటు ఇవ్వగా రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు ఎట్టకేలకు ఒక ఇంటి వారు కాబోతున్నారు. ఇక తేజస్వి ఓ ఇంటి వాడు అవుతుండ డంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు ముందుగానే చెపుతున్నారు.