మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా ఆస్తులు లక్షల్లోనే.. ఎవరా పేద సీఎం...!
ఆ పేద సీఎం ఇంకెవరో కాదు ? మమతా బెనర్జీ .. తాజాగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫరెన్స్ దేశంలో అన్ని రాష్ట్రాల ప్రస్తుత ముఖ్యమంత్రుల ఆస్తి పాస్తుల వివరాలను బయటపెట్టింది. ఇందులో అతి తక్కువ ఆస్తులను కలిగిన ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ నిలిచారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆమె ఆస్తులు చాలా తక్కువగా ఉన్నట్టు ఎడిఆర్ పేర్కొంది. మమతా బెనర్జీ తనకు తానే పేద సీఎంగా ప్రకటించుకున్నారు. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న ఆమె కేవలం లక్షల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమె మొత్తం ఆస్తులు విలువ 15 లక్షలు మాత్రమే .. ఈ మేరకు ఏడిఆర్ తన నివేదికలో పేర్కొంది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మంత్రి ఏ ఒక్కరోజు జీతం కూడా తీసుకోవటం లేదు .. పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జీతం తీసుకోనని ప్రకటించిన ఆమె కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటున్నారు. ఇక ఏడిఆర్ విడుదల చేసిన ముఖ్యమంత్రుల ఆస్తి పాస్తులు జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం కుటుంబస్తులు రు. 931 కోట్లు ఉన్నాయి. అత్యంత భారీ ఆస్తులు కలిగి ఉన్న ఆయన భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని పేర్కొంది.
చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు నిలిచారు. ఆయన కుటుంబస్తులు 332 కోట్లు కాగా ఆయనకు 180 కోట్లు అప్పులు ఉన్నాయి. మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆస్తులు 51 కోట్లు.. ఇక చివరి నుంచి రెండో స్థానంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేవలం 55 లక్షల ఆస్తులతో ఉంటే ... కేరళ సీఎం పినరాయి విజయం ఒక కోటి ఆస్తులతో చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నారు.