చిరంజీవి సినిమా చూస్తుంటే ఫుల్లుగా తాగేసి బండ బూతులు.. ఆ రోజు శ్రీదేవి థియేట‌ర్లో ఏం జ‌రిగింది..!

Amruth kumar
ఎప్పుడో కొన్నేళ్ల క్రితం చెన్నైలో జరిగిన ఓ సంఘటన అల్లు అరవింద్ ద్వారా బయటికి వచ్చింది. చెన్నైలో దేవి - శ్రీదేవి అనే జంట థియేటర్లు ఉండేవి. ఆ థియేటర్లలో అల్లు అరవింద్ పార్ట్నర్ గా ఉండేవారు. ఒక పెద్ద ప్రొడక్షన్ మేనేజర్ కూడా ఉండేవారట. అతను అల్లు రామలింగయ్య - చిరంజీవి - శ్రీదేవి లాంటి స్టార్ సెల‌బ్రిటీల కాల్‌షీట్లు మేనేజ్ చేసేవారట. . ఆ మేనేజర్ చాలా టాలెంటెడ్ అయినా మందు తాగితే మనిషి కాదట. ఎవరిని అయినా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తాడట. ఈ క్రమంలోనే ఒకటి రెండుసార్లు ఫుల్లుగా మందు వేసి చిరంజీవిని బూతులో తిట్టడంతో అల్లు అరవింద్ వార్నింగ్‌ ఇచ్చి వదిలేసారట.
ఈ విషయం చిరంజీవికి కూడా తెలియడంతో వాడిని నా దగ్గరికి తీసుకురా బుద్ధి చెబుతాను అని కూడా అరవింద్ కు చెప్పారట. ఒకరోజు చిరంజీవి శ్రీదేవి థియేటర్ లో సినిమా చూస్తుండగా ఆ మేనేజర్ ఫుల్లుగా మందేసి థియేటర్ ముందుకు వచ్చి చిరంజీవి ఎక్కడ ? బయటకు రమ్మను వాడి సంగతి చెబుతా అంటూ మత్తులో ఊగిపోతూ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నాడట. వెంటనే అల్లు అరవింద్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో . .. గొడవ చేయటం బాగోదని కారులో ఎక్కించబోతే అల్లు అరవింద్ ని కిందకి తోసి మరి చిరంజీవిని బూతులు తిడుతున్నాడట.
వెంటనే అల్లు అరవింద్ వాచ్ - కళ్ళజోడు పక్కనపెట్టి ఆ మేనేజర్ కాలర్ పట్టుకుని ఉతికి పడేసాడట. అల్లు అరవింద్ గట్టిగా కొట్టడంతో అతనికి 13 కుట్లు పడ్డాయట. ఓవైపు చిరంజీవి థియేటర్లో సినిమా చూస్తున్నాడు .. చిరంజీవి గారికి కూడా ఆ బూతులు విని ఉంటే ఇంకా కోపం వచ్చేది అని చాలా రోజుల క్రితం జరిగిన సంఘటన బయట పెట్టారు. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: