ప్రముఖ స్టార్ హీరోయిన్ ను లాగిపెట్టి కొట్టిన దర్శకుడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

Reddy P Rajasekhar
భాషతో సంబంధం లేకుండా క్రేజ్ కలిగి ఉన్న హీరోయిన్లలో మమితా బైజు కూడా ఒకరు. ఈ స్టార్ హీరోయిన్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరుగుతోంది. ప్రేమలు సినిమా సక్సెస్ మమితా బైజు కెరీర్ కు ప్లస్ అయిందనే సంగతి తెలిసిందే. అయితే ఈ స్టార్ హీరోయిన్ గురించి ఒక గాసిప్ జోరుగా ప్రచారంలోకి రావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది. ఈ గాసిప్ గురించి క్లారిటీ కూడా వచ్చేసింది.
 
ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన బాల మమితా బైజును లాగిపెట్టి కొట్టారని ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సూర్య, మమితా బైజు హీరో హీరోయిన్లుగా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. కొంత భాగం షూట్ పూర్తైన తర్వాత సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దర్శకుడు బాల తనను కొట్టారని అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నానని మొదట మమితా బైజు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
 
అయితే ఆ తర్వాత మాత్రం మీడియా తన మాటలను వక్రీకరించిందని నా గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె అన్నారు. దర్శకుడు బాల సైతం ఈ వివాదం గురించి తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను మమితను కొట్టానని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. మేకప్ ఎక్కువగా ఉంటే ఎందుకు ఓవర్ మేకప్ అని అడిగేవాడినని ఆయన కామెంట్లు చేశారు.
 
అలా చేశానే తప్ప తాను ఎప్పుడూ మమితా బైజుపై చేయి మాత్రం చేసుకోలేదని పేర్కొన్నారు. మమితా బైజు నా కూతుర్ లాంటి వ్యక్తి అని ఆమెను కొట్టాల్సిన అవసరం నాకు ఏముందని బాల అన్నారు. బాల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దర్శకుడు బాల తర్వాత సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: