బ‌న్నీ కంటే ముందే థియేట‌ర్ ర‌చ్చ‌లో అరెస్టైన అల్లు అర‌వింద్‌.. మ్యాట‌ర్ సీఎం దాకా...!

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు సంధ్య థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనంగా మారిందో .. జాతీయ మీడియాలో ఎలా హైలైట్ అయిందో చూశాం. రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు అపస్మార‌క‌ స్థితిలో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లు అర్జున్ ని సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు ఏ 11 నిందితుడిగా చేర్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావటం .. మ్యాటర్ ఇంకా సీరియస్ కావడం చూసాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంఘటనని చాలా సీరియస్గా తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ వయసు 42 ఏళ్ళు .. అల్లు అరవింద్ కూడా తన వయసు 40 లలో ఉన్నప్పుడు థియేటర్ దగ్గర జరిగిన గొడవ కారణంగా అరెస్టు అయ్యారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో గతంలో చెప్పారు. ఈ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

వయసులో ఉన్నప్పుడు తాను బాగా రెబల్గా ఉండేవాడిని అని అరవింద్ తెలిపారు. ఎవరు తప్పు చేసినా భరించే వాడిని కాదని .. చెన్నైలో కాలేజీలో చదువుతున్నప్పుడు అల్లు అరవింద్ తన ఫ్రెండ్స్ తో కలిసి సిటీ బస్సులో వెళుతున్నారట. అది కాలేజీ స్టూడెంట్స్ కోసం వేసిన‌ స్పెషల్ బస్ .. కండక్టర్ కి మా ఫ్రెండ్స్ కి గొడవ జరిగింది .. వెంటనే మేమంతా బస్సు ఆపేసి కండక్టర్ ని .. డ్రైవర్ ని కొట్టి కిందకు దింపేసాం .. మేమే డ్రైవ్ చేసుకుంటూ స్టూడెంట్స్ ని వారి వారి ఏరియాలో డ్రాప్ చేసాం .. ఆ తర్వాత పోలీసులు మా ఇంటికి వచ్చి అరెస్టు చేశారని అరవింద్ తెలిపారు.

దీంతో అల్లు అరవింద్ తండ్రి లెజెండ్రీ అల్లు రామలింగ రంగంలోకి దిగారట ముఖ్యమంత్రి ఎంజీఆర్ తో మాట్లాడి బెయిలు ఇప్పించారట. కేసు కొన్ని రోజులు సాగింది .. అల్లు రామలింగే స్వయంగా ముఖ్యమంత్రి ఎంజీఆర్ తో మాట్లాడడంతో పోలీసులు అల్లు అరవింద్ కు వార్నింగ్‌ ఇచ్చి కేసు కొట్టు వేసారట. తాను స్టూడెంట్ కాబట్టి వారినితో సరిపెట్టారు. కొద్ది రోజులపాటు పత్రికల్లో హాట్ టాపిక్ అయింది అని అల్లు అరవింద్ స్వయంగా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: