టాలీవుడ్: మూడేళ్లుగా కలిసిరాని సంక్రాంతి.. తొలి సినిమానే డిజాస్టర్..?
2024 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా మాస్ ఎంటర్టైన్మెంట్గా భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే కొంతమందికి నచ్చిన మరి కొంతమందికి మిక్స్డ్ టాక్ గాని పరిమితమైంది.
2025లో రామ్ చరణ్ , డైరెక్టర్ శంకర్ కామినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది.
2026 లో ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వచ్చిన ది రాజా సాబ్ సినిమా హర్రర్ కామెడీగా విడుదలైన ఈ చిత్రం అభిమానులను మెప్పించిన అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించ లేకపోయిందని టాక్ వినిపిస్తోంది. కొంతమందికి రాజా సాబ్ సినిమా కొందరికి నచ్చిన కొంతమందికి కనెక్ట్ కాలేదనే విధంగా వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలు సంక్రాంతి బరిలో ఏ సినిమా మొదట విడుదలైన మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయం సంక్రాంతి సెంటిమెంటుతో ముడి పెట్టడం కంటే ప్రతి చిత్రానికి సరైన కంటెంట్ ఫైనల్ జడ్జ్ అనే వాస్తవాన్ని గుర్తించాలని సినీ నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కథ బలంగా ఉంటే ఏ సీజన్ అయినా సరే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు.