' రాజా సాబ్ ' ... ఇండియా హెరాల్డ్ పోస్టుమార్టమ్ రిపోర్ట్..!
థమన్ ఇంటర్వెల్ బ్యాంగ్ సంజయ్‌దత్ ఎంట్రీ సీన్లకు బీజీఎం అదరగొట్టేశాడు.. థియేటర్లలో ఆ సీన్లకు థమన్ బీజీఎంతో మాంచి ఊపు వచ్చింది. ఫ్రీ ఇంటర్వెల్ నుంచే కాస్తసినిమాకు ఊపు వస్తుంది. - మారుతి రొమాంటిక్ ట్రాక్‌ను భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజు పండగే సినిమాలో సీన్లను కాస్త ప్రభాస్ స్టైల్లో మార్చి తీసినట్టుగా కూడా ఉంది. స్టార్టింగ్‌తో పోలిస్తే ఇంటర్వెల్ చూశాక సెకండాఫ్‌లో ఏదో ఉంది అన్న ఆసక్తి క్రియేట్ చేశాడు. - సంజయ్ దత్ ప్లాష్ బ్యాక్ స్టోరీ - ముఖ్యంగా అతను తాంత్రిక శక్తులను ఎలా సంపాదిస్తాడో చూపించే ఎపిసోడ్స్, బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బాగున్నాయి. ఫస్టాఫ్ మొత్తానికే ప్రీ-ఇంటర్వెల్ హైలైట్ గా నిలుస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్ పై మంచి అంచనాలను ఏర్పరుస్తుంది.
- సినిమా స్టార్టింగ్ నుంచి 45 నిమిషాలు బాగా నిరాశ పరుస్తుంది. చాలా అంటే చాలా బోరింగ్‌గా ఉంటుంది. కామెడీ వర్కవుట్ అవ్వలేదు. పాటలు కూడా సినిమాను నిలబెట్టలేదు.
- నిధి అగర్వాల్, సప్తగిరి వచ్చినప్పుడు ప్రేమకథా చిత్రమ్ సీన్లను గుర్తుకు తెస్తాయి. - సెకండాఫ్‌లో అడవిలో ఉన్న గదిలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌తో ఇటు రొమాంటిక్ ట్రాక్, అటు భయపడుతూ చేసే కామెడీ బాగుంది. - సెకండాఫ్‌లో అయినా కొత్తగా ఉంటుందని ఆశిస్తే నిరాశ తప్పదు. రొమాంటిక్ ట్రాక్ అయినా, హర్రర్ అయినా , కామెడీ అయినా మారుతి గత సినిమాలను చూసి స్ఫూర్తి పొందినవే అని క్లీయర్‌గా తెలిసి పోతూ ఉంటాయి.
- ప్రభాస్ తాత పాత్ర చేసిన సంజయ్‌దత్ హిప్నటైజ్ చేసి ప్రతి ఒక్కరిని తన కంట్రల్లోకి తెచ్చుకుంటాడు... దాని నుంచి బయట పడేందుకు సెల్ఫ్ హిప్నటైజ్ చేసి బయట పడతాడు. ఈ కాన్సెఫ్ట్ వర్కవుట్ కాలేదు. సంజయ్ దత్ ఎవరిని అయినా హిప్నటైజ్ చేసి వారి వీక్‌నెస్ మీద దెబ్బకొట్టి తన కంట్రల్లోకి తెచ్చుకుంటాడు. అతడి కంట్రోల్ నుంచి బయటకు రావాలంటే అతడిని మించి ఆలోచించాలి. మనిషి ఇంటిలిజెన్స్‌ను పూర్తిగా వాడుకోవాలన్నది క్లైమాక్స్‌లో ప్రభాస్ వాడతాడు. కథ అంతా పూర్తి గందరగోళంగా మారింది. స్క్రీన్ ప్లే విషయంలోనూ చాలా లోపాలు ఉన్నాయి. సీన్ల పరంగా చూస్తే బాగుంటుంది అనిపించినా.. సినిమా పరంగా ఆకట్టుకోదు.