విడాకులు త‌గ్గేందుకు డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ చెప్పిన చిట్కా ఇదే..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పేరు చెబితేనే మనకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించిన వారే. ఎలాంటి హీరో అయినా పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేస్తే తనకు తిరుగే లేని మాస్ ఇమేజ్ వస్తుందని ఆశలు పెట్టుకునేవారు. అయితే కొంతకాలంగా పూరి ఫామ్ లో లేరు .. తన స్థాయికి తగిన హిట్లు ఇవ్వటం లేదు. 7 - 8 వరుస డిజాస్టర్ సినిమాల తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ఫామ్ లోకి వచ్చిన పూరి ఆ వెంటనే విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన లైగ‌ర్ ... గత ఏడాది రామ్ హీరోగా తీసిన డబుల్‌ ఇస్మార్ట్ సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి దీంతో పూరి కెరీర్ పరంగా మళ్ళీ పాతాళంలోకి వెళ్లిపోయారు. ఇక కొద్ది రోజులుగా పూరి మ్యూజిక్స్ పేరుతో ఆయన వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వినియోగంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటే జీవితాలు మారతాయని విడాకులు తీసుకునే వారి సంఖ్య తగ్గుతుందని పూరి తెలిపారు.

సోష‌ల్ మీడియా చాలా పవర్ఫుల్ ... దాని ప్రారంభ దశలో కమ్యూనికేషన్ పెరిగిందని అనుకున్నాం కానీ ... రాను రాను అది మన జీవితాల్లో దయ్యంలా మారింది .. దానివల్ల ఇతరులతో పోల్చుకోవడం ఎక్కువైంది ... భర్తతో కాపురం చేయడం కంటే తమ భాగస్వామితో అన్యోన్యంగా ఉన్నట్టు ఫోటోలు పోస్ట్ చేయడంపై చాలామంది ఆసక్తి పెడుతున్నారు. కొత్త దుస్తులు ధరిస్తే ఓ ఫోటో తీయాలి ... బెడ్ రూమ్ లో ఓ ఫోటో ... తింటున్నప్పుడు ఓ ఫోటో .. దీనికి తోడు ట్రోల‌ర్స్ ... ఈ సోషల్ మీడియా పోస్టుల వల్ల ఎంతోమంది దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి .. బంధాలు దెబ్బతింటున్నాయి .. ప్రతి 10 విడాకులలో మూడు సోషల్ మీడియా కారణంగానే జరుగుతున్నాయని పూరి జగన్నాథ్ తెలిపారు. ఏ పోస్ట్ పెట్టిన నెగిటివిటీని ఆకర్షిస్తున్నట్టే .. మరి ముఖ్యంగా పెళ్లయిన వారంతా సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటామని కొత్త సంవత్సరంలో తీర్మానించుకోవాలని అప్పుడు ఆలోచనలు మారుతాయి ... జీవితాలు మారుతాయి ... విడాకులు తగ్గుతాయని పూరి జగన్నాథ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: