
రాబోయే 30 రోజులు .. ఊహించని మూడు సినిమాల అనౌన్స్మెంట్స్..!
ఇక ఆ సినిమా ఇచ్చిన కిక్కు తో చిరంజీవి కోసం కథ రెడీ చేస్తున్నాడు ఈ స్టార్ దర్శకుడు.. చిరంజీవి తో చేసే సినిమాను ఉగాదినాడు పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నాడు అనిల్ రావుపూడి .. చిరు , అనిల్ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి .. ఉగాది రోజున ముహూర్తం పెట్టి మే తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. అలాగే అల్లు అర్జున్ అట్లీ సినిమా ఓపెనింగ్ పై కూడా ఓ క్లారిటీ వచ్చింది .. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా అట్లీ సినిమా పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయని తెలుస్తుంది . ఇక అట్లీ , అల్లు అర్జున్ సినిమా బడ్జెట్ 500 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా ..
సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు ఇందులో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని కూడా తెలుస్తుంది . ప్రస్తుతం దుబాయ్లో స్టోరీ సిట్టింగ్స్ తో బిజీబిజీగా గడుపుతున్నారు .. మే నుంచి బన్నీ అట్లీ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది . ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్పిరిట్ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఏప్రిల్ లోనే జరగబోతున్నాయి .. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు దర్శకుడు సందీప్ వంగ .. ఆరు నెలల్లోనే స్పిరిట్ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు సందీప్ .. ఇలా మొత్తానికి రాబోయే నెల రోజుల్లో మూడు పెద్ద సినిమాల ఓపెనింగ్స్ ఉండబోతున్నాయి .