
టాలీవుడ్ అందరికీ వెంకటేషే కనిపిస్తున్నాడా .. వెంకీ మామ న్యూ మూవీ అప్డేట్..!
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బాగా వర్క్ చేయడం వల్ల మోకాలు నొప్పి వచ్చింది .. దానికి రెస్ట్ తీసుకోవటమే ముందు .. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు .. ఈ లోగా వివి వినాయక్ , హరీష్ శంకర్ ఇంకా ఇంకా చాలామంది దర్శకులు వెంకటేష్ కు కథలు చెప్పే పనిలో ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి .. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏమిటంటే కథ అనేది ముందు వెంకటేష్ అన్న సురేష్ బాబు కు నచ్చాలి .. ఆయన ఓకే చేయాలి .. ఆయన చెప్పే కరెక్షన్లు మిగిలినవన్నీ అవి దాటాలి అప్పుడు కానీ సినిమా అనేది ముందుకు వెళ్ళదు .
ఇదివరకు వెంకటేష్ వేరు .. ఇప్పుడు వేరు సరైన సినిమా పడితే వందల కోట్లు రాబట్టచ్చు అనేది అర్థమైంది .. తర్వాత విషయం ఎలా ఉన్నా ఇప్పుడు అర్జెంటుగా చేసే సినిమాకు గట్టిగా మార్కెట్ ఉంటుంది .. అలాగే రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది .. దీనికనుగుణంగా మార్కెట్ లెక్కలు చూసుకోవాలి . ఇవన్నీ జరగాలంటే చాలా అంటే చాలా సమయం పడుతుంది . ఇదే క్రమంలో 2026 సమ్మర్ వరకు దాదాపుగా అన్ని ఓటీటీ స్లాట్‌లు అన్నీ అమ్ముడైపోతున్నాయి .. అలా స్లాట్ చూసుకుంటే తప్ప రంగంలోకి దిగడం కష్టం అందువల్ల వెంకటేష్ సినిమా అనౌన్స్మెంట్ ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చు .. అది వచ్చేవరకు ఇలాంటి గాలి వార్తలు వస్తూనే ఉంటాయి .