"అదే మీ లాస్ట్ బ్రీత్ అంటే మీరు చేసే మొదటి పని ఏంటి..?".. హార్ట్ టచింగ్ ఆన్సర్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..!

Thota Jaya Madhuri
మనిషి అన్నాక ఎమోషన్స్ కంపల్సరీ . ప్రతి ఒక్కరికి ఒక పర్సన్ తో స్పెషల్ బాండింగ్ ఉంటుంది . మనిషి పుట్టుక పుట్టాక ఆ పుట్టుకకు ఎండ్ కార్డ్ కూడా పడాల్సిందే . మనిషికి జననం ఎంత ఇంపార్టెంట్టో మరణం కూడా అంతే ఇంపార్టెంట్. అయితే మన జననం సమయంలో మనకి ఏ రిలేషన్షిప్ తెలియదు. కానీ మన మరణం సమయంలో మాత్రం మనకి ఒక రిలేషన్షిప్ ఉంటుంది . తెలిసిన వాళ్ళు ..బంధువులు ..భార్య.. భర్త.. పిల్లలు అందరూ కూడా గుర్తొస్తారు. అయితే ఎవరికైనా సరే ఒక క్వశ్చన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది .


"అదే మీకు లాస్ట్ బ్రీత్ అని మీకు తెలిసినప్పుడు మీరు మొదటగా గుర్తు తెచ్చుకునే వ్యక్తి ఎవరు..?" అనే విషయం అందరికీ చాలా ఎమోషనల్ ప్రశ్న . అయితే పలు ఇంటర్వ్యూలలో ఇలాంటి ప్రశ్నలను చాలా డేరింగ్ చేసి  స్టార్స్ ని అడుగుతుంటారు హోస్టులు. తాజాగా అదే ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ ను ఒక హోస్ట్ ప్రశ్నించింది. దానికి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఆన్సర్ అందరికీ బాగా నచ్చేసింది . ఒకానొక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ని ఒక లేడీ హోస్ట్ ప్రశ్నిస్తూ.." అదే మీకు చివరి బ్రీత్ అని మీకు తెలిసినప్పుడు మీరు మొదటగా గుర్తు తెచ్చుకునే వ్యక్తి ఎవరు..?" అంటూ ప్రశ్నించగా ..


వెంటనే తారక్.."లక్ష్మీ ప్రణతి" అంటూ తన భార్య పేరు చెప్పుకొచ్చాడు . ఒక భర్తకు తన భార్యకు మించిన బెస్ట్ ఫ్రెండ్.. కావాల్సిన మనిషి ఎవరుంటారు అన్న విషయాన్ని చాలా సింపుల్ లాజిక్ లోనే చెప్పేసాడు జూనియర్ ఎన్టీఆర్ .ఈ వీడియోని మరొకసారి నెట్టింట బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాడు . న్యూ ఇయర్ ని అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత దేవర2ను సట్స్ ఫై కి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాడు అంటూ కూడా తెలుస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: