టీమిండియాలో.. ధోని ఫేవరెట్ బ్యాటర్ ఎవరో తెలుసా?
అందుకే క్రికెటర్లకు సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు అంటే చాలు ప్రెసెంట్ క్రికెటర్లు ఎవరు మీ ఫేవరెట్ అనే ఒక ప్రశ్న ఎదురవుతూ ఉండడం సర్వసాధారణం. ఇటీవల మహేంద్రసింగ్ ధోని కి కూడా ఇదే విషయంపై ప్రశ్న ఎదురయింది. అయితే ధోని లాంటి క్రికెటర్ ఏం సమాధానం చెబుతాడో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ధోని చెప్పిన సమాధానం ఏంటి అని తెలుసుకునేందుకు తెగ ఆత్రుత పడుతున్నారు అని చెప్పాలి.
ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్నాడు మహేంద్రసింగ్ ధోని. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలో మీకు ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు అనే ప్రశ్న అక్కడ ధోనీకి ఎదురైంది. ఈ ప్రశ్నపై స్పందించిన ధోని ఆసక్తికర సమాధానం చెప్పాడు. బౌలర్లలో ఫేవరెట్ ఎవరు అని ఎంచుకోవడం ఎంతో సులభం. కానీ బ్యాటర్లలో మాత్రం ఫేవరెట్ ని ఎంచుకోవడం చాలా కష్టం అంటూ సమాధానం చెప్పాడు. ఎందుకంటే టీమ్ ఇండియాలో చాలామంది అత్యుత్తమ బ్యాట్స్మెన్లు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు ధోని. అలా అని బౌలర్లలో మంచి బౌలర్లు లేరు అని కాదు. కానీ బ్యాట్స్మెన్లలో ఫేవరెట్ ఎవరు అని ఎంచుకోవడం కష్టమే అంటూ ధోని సమాధానం చెప్పాడు. దీంతో ధోని ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు అని తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురుచూసిన అభిమానులకు ఆ కోరిక తీరలేదు అని చెప్పాలి.