అట్లి వెనుక బన్నీ.. పెద్ద ప్లాన్.. సక్సెస్ అయితే మరో బ్లాక్ బాస్టర్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఈయన తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికి కూడా ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను రాబడుతుంది.

ఇది ఇలా ఉంటే పుష్ప పార్ట్ 2 సినిమా విడుదల కాకముందు అల్లు అర్జున్ , అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు అనేక వార్తలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ వార్తలకు అనుగుణం గానే అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి అట్లీ ని కూడా కలిసినట్లు వార్తలు వచ్చాయి. దానితో విరి కాంబో మూవీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత వీరి కాంబోలో సినిమా ఇప్పట్లో లేదు అని ఓ వార్త వైరల్ అయింది. ఇకపోతే చాలా మంది పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల కాకముందు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు అని వార్తలు రావడంతో అట్లీ కమర్షియల్ సినిమాలను బాగా తెరకెక్కిస్తాడు. కానీ అవి అల్లు అర్జున్ పై వర్కౌట్ అవుతాయా ... అనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక పుష్ప పార్ట్ 2 మూవీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ కలెక్షన్లను వసూలు చేస్తుంది.

దానితో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయడం ఈ సమయంలో కరెక్టు డెసిషన్. అందుకే ఆయన ఆ దర్శకుడితో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశాడు. ఆయన కమర్షియల్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడు. ఆయనతో , అల్లు అర్జున్ మరికొంత కాలంలోనే సినిమా చేస్తే బెస్ట్ అనే అభిప్రాయాలను ప్రస్తుతం చాలా మంది జనాలు వ్యక్త పరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: